కాంగ్రెస్ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ రిచెస్ట్ మ్యాన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది రోజున తిరుమలకు వచ్చిన ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరబోతున్నట్టు తెలిపారు. దీంతో ఇంతకాలం ఆయనపై వచ్చిన పుకార్లు నిజమయ్యాయి.
తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. ఇది నేను ముందే చెప్పాను. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది – కోమటి రెడ్డి
తాను బీజేపీలో చేరుతున్నాను. కానీ మా అన్న బీజేపీలో చేరడం లేదు. ఆయన (తన సోదరుడు వెంకటరెడ్డి) మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారు అని చెప్పారు. మా పార్టీలు వేరైనా మేము అన్నదమ్ములగా కలిసే ఉంటామన్నారు.