మాజీ సీఎం జగన్ పాలనలో ఏపీలో జీవోలు అన్నిటిని రహస్యంగా ఉంచిన సంగతి తెలిసిందే. సమాచార హక్కు చట్టం కింద జీవోలు కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే అ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా సరే జగన్ సర్కారు మాత్రం ఆ జీవోలను రహస్యంగానే ఉంచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నిటిని జీవో ఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తాజాగా నిర్ణయించింది.
2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు రహస్యంగా ఉంచిన జీవోలను ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు సీక్రెట్ గా ఉన్న జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, పబ్లిక్ డొమైన్ లో ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెబ్సైట్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటివరకూ అన్ని జీఓలు అందుబాటులో ఉన్నన్నాయని, 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఉన్న జీఓలు మాత్రమే అందుబాటులో లేవని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది. మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతుంది.