కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సీఎం జగన్ ప్రేమ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లోకి వస్తోంది. ఆయన వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై.. అప్పట్లో వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. సీఎం జగన్‌ను ప్రశ్నించిందని.. ఆయన అప్పట్లో సమర్థించారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. నేను గట్టిగా మాట్లాడితే.. అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్ చెప్పారు.
ఈ విషయాలు అప్పట్లో అన్ని ప్రధాన వార్తా చానళ్లలో పదే పదే ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ.. సునీత అభ్యర్థించడం.. కేసును తెలంగాణ కోర్టుకు బదిలీ చేయడం తెలిసిందే. ఇక, అప్పటి నుంచి కూడా.. అవినాష్.. సీఎం జగన్‌ల విషయంపై అనేక విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. అయితే.. తాజాగా మరోసారి సీఎం జగన్.. అవినాష్‌పై ప్రేమ ఒలకబోశారు.
ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న సీఎంజగన్.. అవినాష్‌ను దరి చేర్చుకుని.. మరీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి పర్యటనలోనూ అవినాష్ కనిపించారు. పులివెందుల నుంచి తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో ఒక పేషెంట్ వేరే జిల్లా నుండి వచ్చి తన కష్టాన్ని సీఎం జగన్‌కు చెప్పుకొన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి అవినాష్ ను నా తమ్ముడు అని పదే పదే పేర్కొనడం గమనార్హం.
అంతేకాదు.. అవినాష్ నా తమ్ముడే కదా స్వామీ.. ఆయనే చూస్తాడు చెవుతాను లే బ! అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం. మొత్తానికి సీఎం జగన్‌కు, అవినాష్‌కు మధ్య ఉన్న బంధం మరో సారి బహిర్గతమైందని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.