నిజం నాలుగు ఊర్లు దాటే సరికి…అబద్దం అరవై ఊళ్లు దాటుతుందన్నదో నానుడి…ఓ పక్క మీడియా …మరో పక్క సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో ఆ అబద్ధం మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే, నిజం నిప్పులాంటిది..ఏనాటికైనా బయటపడక తప్పదు …అపుడు అబద్ధాలు ప్రచారం చేసిన వారి గుట్టు రట్టయి అవమానాలపాలు కాకా తప్పదు.
ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత…రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ నేతలు చెబుతంటే…జగనన్న హయాంలోనే ఏపీకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ హయాంలోనే 64 భారీ మెగా పరిశ్రమలు ఏర్పాటు చేశామని, రూ 30 వేల కోట్ల మేర పెట్టుబడులు ఆకర్షించామని, 48 వేల మందికి ఉధ్యోగాలు కల్పించామని పరిశ్రమల శాఖా మంత్రి స్వయంగా చెప్పడం విడ్డూరం.
ఇక, చంద్రబాబు తెచ్చిన కియా పరిశ్రమనూ తమ ఖాతాలో వేసుకున్నారు వైసీపీ నేతలు. హీరో,అశోక్ లేల్యాండ్ వంటి భారీ కంపెనీలు కూడా తమ పాలనలోనే ఉత్పత్తి ప్రారంభించినట్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే, తాజాగా ఏపీ నుంచి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఫార్ఛున్ 500 కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరలిపోవడంతో వైసీపీ గుట్టు రట్టయింది.
ఇదొక్కటే కాదు, లూలు గ్రూఫ్,బిఆర్ శెట్టి గ్రూఫ్,ఎపిపి పేపర్ పరిశ్రమ,రాజధానిలో ఏర్పాటు చేయాలనుకొన్న రూ 50 వేల కోట్ల విలువైన సింగపూర్ స్టార్టఫ్ సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయ్యాయి. అమరావతి రాజధాని కాదన్న విషయం తెలిసిన మరునిమిషమే ఆయా సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయి. గత ప్రభుత్వం మూడు సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి రూ 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ 17 లక్షల కోట్ల విలువైన భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం ఆంధ్రుల దౌర్భాగ్యం.
జగన్ పులివెందు పంచాయతీలు, మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటలు చూసి…. సుమారు రెండు లక్షల కోట్లతో ఏర్పాటు చెయ్యాలనుకొన్న 130 సంస్థలు వెనక్కి వెళ్ళి పోయ్యాయి. గట్టిగా మాట్లాడితే ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందం ఒక్కటి కూడా లేదు. ఇంకా చాలా కంపెనీలు చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.
చంద్రబాబు హయాంలో 2018- 19 లో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది రేటు 10.24 శాతం వుండగా రాష్ట్ర వృద్ది రేటు జిఎస్ డిపి 11.2 శాతంగా వుంది. 2020 -21 లో పారిశ్రామిక వృద్ది రేటు 3.26 శాతానికి పడిపోయి.రాష్ట్ర వృద్దిరెటు జీఎస్ డీపీ-2.58 శాతానికి దిగజారిందంటే జగన్ చలవే. అందుకే, ఈ అబద్ధాల పునాదుల మీద నిర్మించిన జగన్ సర్కార్ తమకు వద్దని, ఏపీకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబే కావాలని జనం కోరుకుంటున్నారు.