అప్పటిదాకా ఉన్న కథ వేరు..తరువాత కథ వేరు. వైఎస్సార్ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, రుణాల వర్తింపు, తరువాత ఆ రుణాలను జగన్ కంపెనీలకు సంబంధిత వర్గాలకు ఏ విధంగా అయినా మేలు చేసేందుకు మళ్లించిన విధానం ఇవన్నీ కూడా అప్పట్లో సంచనాలను రేపాయి. కేసు కు సంబంధించి దర్యాప్తు అధికారం ఉన్న ఈడీ కానీ సీబీఐ కానీ ఇప్పుడంత యాక్టివ్ గా లేవు అన్న వాదన వస్తోంది. అంటే కేసులకు సంబంధించి ఏళ్లకు ఏళ్లు గడిచి పోతున్నా ఆధారాల సేకరణ అన్నది సాగడం లేదు.
దీంతో వాన్ పీక్ కేసు నుంచి మొన్నట వేళ నిమ్మగడ్డకు రిలీఫ్ దొరికింది. ఇంకా ఇతరులకు కూడా రిలీఫ్ దొరికింది. ఆ విధంగా ఇప్పటి వైఎస్ జగన్ సర్కారులో పెద్దలంతా సేఫ్ అని కూడా తేలిపోయింది. కేవలం దర్యాప్తు సంస్థల అలసత్వం లేదా నిర్లక్ష్యం కారణంగానే అప్పుడూ ఇప్పుడూ ఇటువంటి పరిణామాలలో, సంబంధిత కేసుల దర్యాప్తులలో రాజకీయ ప్రమేయం హాయిగా నడిచిపోతోంది.
కొన్ని కమ్యూనిస్టు సంఘాలు లేదా సంస్థలు వీటిపై మాట్లాడినా కూడా ఇప్పుడు అవి కూడా జగన్ కు చాలా సానుకూలంగానే ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్రభుత్వ సలహాదారుకు సన్నిహితంగా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుడు నాటి ఘటనలపై తాజా మైనింగ్ పై లేదా తాజా కొండల తవ్వకాలపై ఏమీ మాట్లాడలేని ఉదాశీనతలో ఉండి పోతున్నారు.
ఇప్పటిదాకా సహజ వనరులను పరిరక్షించిన దాఖలాలు ఏవీ లేవు. ముఖ్యంగా నాటి వైఎస్సార్ హయాంలో కానీ లేదా ఇప్పటి జగన్ హయాంలో కానీ..? ఎప్పటికప్పుడు వివాదాలు మాత్రం ఉన్నాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట ఇందు గ్రూప్ కారు చౌకగా కొట్టేసిన భూముల భాగోతం ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రధాన మీడియా ఈనాడు ఇవాళ వెలుగులోకి తెచ్చింది.
ఆరోజు అత్యంత తక్కువ ధరకే భూములు పొందిన ఇందు గ్రూపు తరువాత జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని, అయితే ఈడీ కేసుల నేపథ్యంలో ఆ భూములు జప్తు చేసిందని, కానీ ఇప్పుడు ఆ జప్తులో ఉన్న భూములనే మళ్లీ తమకు సొంతం చేసుకోవాలని జగన్ వర్గాలు భావిస్తున్నాయని ఆ వార్త సారాంశం. ఆ రోజు విలువైన భూములను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకున్న కంపెనీలు ఇప్పుడు వాటిని తిరిగి చెల్లించే పని అయితే చేయడం లేదు.
పైగా భూములను వేరొక మార్గంలో కొట్టేయాలని చూస్తున్నాయి అనంటూ ఈనాడు వార్తా కథనం అప్పటి తతంగాన్ని గుర్తుకు తెచ్చింది. ఇంత జరుగుతున్నా సంబంధిత దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి అని కూడా ఓ సందేహం కూడా రేపింది. అంటే బ్యాంకుల దగ్గర ఉద్దేశ పూర్వక ఎగవేత దారులుగా రుణ గ్రహీతలుగా ఉన్న ఇందు గ్రూపు పెద్దలు ఉన్నారన్నది కూడా తేల్చింది. ఇదంతా ఒకప్పటి ఘటనలకు కొనసాగింపుగా జరుగుతున్న పరిణామాలు.
ఆ రోజు భూములు కంపెనీల పేరిట తీసుకున్న సంస్థలు తరువాత వాటితో రుణాలు పొంది., ఇప్పుడు మాత్రం వాటిని తిరిగి చెల్లించేందుకు కేసులను అడ్డంగా చూపెడుతున్నాయి. అంతేకాకుండా వాటిని తిరిగి వేలం ద్వారా పొందేందుకు అది కూడా అత్యంత కారు చౌకగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిపై ఇప్పటికిప్పుడు దర్యాప్తు సంస్థలు ఏ మేరకు నిర్ణయం తీసుకోనున్నాయి అన్నది కూడా ఓ ఆసక్తిదాయక వివరం.