ప్రపంచం మొత్తం అరచేతిలో వీక్షించే అద్భుత అవకాశం సోషల్ మీడియాలో నేడు ప్రతి ఒక్కరి సొంతం. చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. గంటల తరబడి టైం పాస్ చేయొచ్చు.. విషయాలు తెలుసుకోవచ్చు.. సంచలనాలు సృష్టించనూ వచ్చు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. సోషల్ మీడియాకు ప్రధాన వనరుగా మారిపోయింది. దీంతో లైకులు, డిజ్లైకులు, ఫార్వర్డ్లు.. ఇలా అనేకం పెరిగిపోయాయి. వ్యక్తుల అభిప్రాయాలు పంచుకునేందుకు, వార్తల సమాచారం.. పంపించుకునేందుకు, కామెంట్లు చేసేందుకు సోషల్ మీడియా నేడు.. ప్రధాన వేదిక.
ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు ఆకాశానికి పెరిగిపోయినప్పుడు.. కరోనా మరణాలను ప్రభుత్వాలు(కొన్ని) దాస్తున్నాయని తెలిసినప్పుడు.. సోషల్ మీడియా జనాలు ఆసక్తిగా స్పందించడం తెలిసిందే. తమ పరిజ్ఞానం మేరకు.. కామెంట్లు చేయడం.. కూడా విన్నాం.. కన్నాం. ఇప్పుడు ఇదే తరహాలో ఏపీ నుంచి తెలంగాణ వరకు.. ఆ మాటకొస్తే.. ఢిల్లీ వరకు కూడా ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జనాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బెయిల్ రద్దు పిటిషన్ను జగన్ పార్టీ సొంత ఎంపీ రఘురామ రాజు దాఖలు చేయడం.. దీనిపై వాదనలు ముగియడం.. నేపథ్యంలో కొన్నాళ్లుగా దీనిపై చర్చ ఆగింది.
కానీ, ఇంతకుముందు.. సొంత పార్టీ ఎంపీనే ఇలా చేస్తారా? అని కొందరు..? నిజంగానే.. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారా? అని మరికొందరు.. సోషల్ మీడియాలో చర్చలకు తెరదీశారు. గంటలు రోజుల తరబడి కూడా ఇవి సాగాయి. అయితే.. ఇప్పుడు మరికొన్ని గంటల్లో.. సీబీఐ నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ బెయిల్ రద్దు పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయం ఆసక్తిగా మారడంతో ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో జగన్ బెయిల్ రద్దు విషయాలే ఆసక్తిగా చర్చకు దారితీశాయి. పుంఖాను పుంఖాలుగా.. కామెంట్లు వరదలా మారాయి.
జగన్ బెయిల్ రద్దవుతుందా? రద్దయితే.. ఏపీ పరిస్థితి ఏంటి? ఆయన సుప్రీంకు వెళ్తారా? హైకోర్టుకు వెళ్తారా? ఎంపీ రఘురామ ఏం చేస్తారు? ఇలా.. అనేక ప్రశ్నల పరంపరతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఇది కేవలం సాధారణ వ్యక్తులే కాదు.. రాజకీయ నాయకుల విషయంలోనూ ఇలానే జరుగుతుండడం గమనార్హం. నాయకులు సైతం..పైకి ఏమీ మాట్లాడకుండా.,. మౌనంగా.. సోషల్ మీడియాలోనే తమ తమ కామెంట్లు పెడుతుండడం గమనార్హం. మొత్తంగా చూస్తే..ఏపీసీఎం జగన్ బెయిల్ పై సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా చర్చ సాగుతుండడం గమనార్హం.