అసెంబ్లీకి రాని జగన్ , వైసీపీ సభ్యులు స్వచ్ఛదంగా రాజీనామా చేయాలని లేదంటే వారిని డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు జగన్ అసెంబ్లీకి రావడానికి తన దగ్గర మంచి చిట్కా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సభలో రోజుకో గంట జగన్కు మాట్లాడే చాన్స్ ఇవ్వాలని, ఆయన మాట్లాడేటపుడు ఎవరూ అడ్డుపడకూడదని కోటం రెడ్డి సెటైర్లు వేశారు.
మైక్ ఆయన ఒక్కడికే ఉండాలి అన్న మైండ్ సెట్ జగన్ కు ఉందని, అది ఆయన ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. 2017లో జగన్ పాదయాత్ర సమయంలో కూడా వైసీపీ సభ్యులెవరినీ జగన్ అసెంబ్లీకి వెళ్లనివ్వలేదని గుర్తు చేశారు. వైసీపీ సభ్యులకు కాకుండా జగన్కు మాత్రమే గంట మాట్లాడే చాన్స్ ఇస్తే మంగళవారం జగన్ అసెంబ్లీకి వస్తారని సెటైర్లు వేశారు. జగన్ను చూసి చాలా రోజులవుతోందని, ఇలా అయిన జగన్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని చెప్పారు. జగన్ ఏనాడూ ప్రజా సమస్యల కోసం పోరాడలేదని, మైక్ కోసమే పోరాడాలని వైసీపీ సభ్యులకు చెప్పేవారని గతాన్ని కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు.