అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలు.. పనులతో.. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌పై.. అంతో ఇంతో సానుభూతి ఉన్న మేధావి వర్గం లోనూ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. `ఇదేం పద్ధతి జగన్!` అంటూ.. వారు దుయ్యబడుతున్నారు. వాస్తవానికి జగన్‌పై అనేక విమర్శలు ఉన్నాయి. న్యాయస్థానాలను సైతం లెక్కచేయకుండా .. వ్యాఖ్యలు చేశారని.. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని సైతం హరిస్తున్నారని.. ఆయనపై తీవ్ర విమర్శలే ఉన్నాయి.
ఇప్పుడు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలోనూ జగన్.. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకే పాల్పడుతోందని.. మేధావి వర్గం నిశిత విమర్శ చేస్తోంది. రాజ్యాంగం ప్రభుత్వానికి ఎన్నిక హక్కులు కల్పించిందో.. అదేసమయంలో ప్రతిపక్షాలకు కూడా కొన్ని హక్కులు కల్పించిందని.. ఏదీ ఊరికేనే రాజ్యాంగంలో పేర్కొనలేదని.. వారు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలు వ్యవహరిం చే తీరు.. ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతుందన్న కనీస స్పృహ లేక పోవడం.. జగన్ సర్కారుకు సరికాదని సూచిస్తున్నారు.
దేవినేని విషయంలో చోటు చేసుకున్న తప్పు ఏమిటో కూడా అర్ధం కావడం లేదని అంటున్నారు. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అది కూడా గత ఎన్నికల్లో వైసీపీ నాయకుడు.. వసంత కృష్ణప్రసాద్ ఎన్నికైన తర్వాత.. ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని.. హైకోర్టులో కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైం ది. దీనికి సంబంధించి ఇటీవల కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మేజర్ కాల్వను పూడ్చేసి మరీ.. గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతుంటే.. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ.. ప్రశ్నించింది.
ఈ క్రమంలో ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వానికి కోర్టు కట్టబెట్టింది. అయినప్పటికీ.. ఇక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా.. మాజీ మంత్రిగా దేవినేని ఉమా.. అక్కడి పరిస్థితులను పరిశీలించే హక్కు ఉంటుంది. ఇది రాజ్యాంగం ప్రతిపక్షాలకు కల్పించిన ప్రాథమిక హక్కు కూడా! అయితే.. దీనిని బూచిగా చూపించి.. ఆయనను అరెస్టు చేయడం.. ఏకంగా హత్యానేరం మోపడం.. అట్రాసిటీ కేసు నమోదు చేయడం వంటివి ప్రజాస్వామ్యంలో విషమమనే చెప్పాలని అంటున్నారు మేధావులు.
గతంలో జేసీ దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. కృష్ణాజిల్లాలో ప్రమాదానికి గురైనప్పుడు.. ప్రతిపక్ష నేతగా జగన్ హైదరాబాద్ నుంచి వచ్చి పరిశీలించినప్పుడు.. అన్న మాటలు.. గుర్తుకు తెచ్చుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. “ప్రతిపక్ష నేతగా నాకు హక్కులేదా?“ అని ఆయన ఆనాడు చెప్పిన మాట.. అధికారంలోకి రాగానే మరిచిపోతే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. పోనీ.. దేవినేని ఉమా.. అధికారుల అనుమతి లేకుండానే అక్కడ పర్యటించారని అనుకున్నా.. దీనికి సంబంధించిన విషయంగా ఆయనను ప్రశ్నించి ఉంటే.. బాగుండేది.
అదేసమయంలో ప్రతిపక్షాల పరిశీలను అవకాశం ఇచ్చి.. తన పార్టీ నేతలలు.. కడిగిన ముత్యాలని.. అక్కడ ఎలాంటి అక్రమాలూ జరగడం లేదని.. చెప్పుకొనే ప్రయత్నం అయినా.. చేసి ఉంటే.. జగన్ పాలనకు సార్థకత చేకూరేదని.. కానీ.. ఇలాంటి తప్పు డు కేసులు.. రాజ్యాంగ బద్ధమైన అధికారాలను సైతం.. బోనులో పెట్టేలా వ్యవహరించడం.. మున్ముందు.. జగన్‌కే మంచిది కాదని అంటున్నారు.