ఏపీ ముఖ్యమంత్రి దూకుడు అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. అయితే, ఆయన పులి మీద స్వారీ చేస్తున్న విషయం ఇంకా తెలుసుకోలేదు. జగన్ చర్యలు మిగతా అందరికంటే కూడా జగన్ కే ఎక్కువ నష్టం …. ఇదీ విశ్లేషకుల మాట. మనిషి ఏం చేసినా ఆలోచనతో చేయాలి, ఒత్తిడిలో చేయకూడదు. దేశ వ్యాప్తంగా నేర చరితుల అంతు చూడాలని సుప్రీంకోర్టు ప్రయత్నించడం, దానికి కేంద్రం అండదండలు అందించడం, ఈ ప్రక్రియ అంతా సుప్రీంకోర్టులో 2వ స్థానంలో ఉన్న ఎన్వీ రమణ పర్యవేక్షిస్తుండటంతో… 38 కేసుల్లో ఇరుక్కున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారట. తన వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లోకి పోతుందని అర్థం చేసుకున్న జగన్ రెడ్డి ఆ ఒత్తిడిలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కనీసం రాజకీయ ప్రయోజనాలు అయినా కాపాడుకునే ప్రయత్నంలో జగన్ వేస్తున్న అడుగులు అతని రాజకీయ భవిష్యత్తును కాపాడుతాయో లేదో తెలియదుగానీ దేశంలో వ్యవస్థలను మాత్రం నైతికంగా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తోంది. అయితే, అమిత్ షాను కలిసి, అనంతరం ప్రధాని నరేంద్రమోదీని కలిసిన అనంతరం సుప్రీంకోర్టు జడ్జి రమణ మీద ఫిర్యాదు చేయడం అన్నది బీజేపీ అండదండలు, సహకారంతోనే చేస్తున్నట్లు అందరికీ అర్థమయ్యేలా జగన్ ప్లాన్ చేశారు.
అయితే, వివ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ఈ విషయంలో జగన్ ను హెచ్చరించింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమిత్ షా అప్పాయింటె్ కోసం ప్రయత్నం చేస్తే దొరకలేదు. చాలా సార్ల రిజెక్ట్ అయ్యింది. దీంతో ఇటీవలే తాను రాజ్యసభ సీటు ఇచ్చిన పరిమళ్ నత్వానీ సాయంతో ఎట్టకేలకు అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరికింది. అపుడు జగన్ ఈ వ్యవహారంతో పాటు పలు విషయాలపై జగన్ రెడ్డి అమిత్ షాను మద్దతు కోరారట.
అయితే అమిత్ షా కేవలం పోలవరం విషయంలో మాత్రం పూర్తి హామీ ఇచ్చారు. మిగతా వాటిలో తాము జోక్యం చేసుకోం అని చెప్పారట. దీనికోసం జగన్ రెడ్డి చంద్రబాబు అనే ఒక ఎమోషనల్ పాయింట్ వాడినా వారు పట్టించుకోలేదు. అయితే, సరిగ్గా వారిని కలిసి వచ్చిన తర్వాత ఫిర్యాదును మీడియాకు వెల్లడించడం వెనుక చాలా వ్యూహం ఉంది. ప్రజల్లో మోడీ, అమిత్ షా లు తన వెనుక ఉన్నారు అనే నమ్మించే రాజకీయ ప్రయత్నం.
దీనివల్ల ఈ ఇష్యూపై వెంటనే తన మీద దాడి జరగకుండా, ఉక్కిరిబిక్కిరి చేయకుండా ఉంటారన్న ప్లాన్ తో బీజేపీ పెద్దల కి చెప్పే చేస్తున్నాను అనే జనం అనుకునేలా కలరింగ్ ప్లాన్ చేశారట జగన్ రెడ్డి. టెక్నికల్ గా ఏ మద్దతు లేకపోయినా … మద్దతు తనకే ఉన్నట్టు ఒక భ్రమను చాలాపద్ధతి ప్రకారం క్రియేట్ చేసుకున్నారు జగన్. అయితే, ఏపీ సీఎం జగన్ వ్యూహాన్ని అర్థం చేసుకున్న ఢిల్లీ పెద్దలు మాటలతో కాకుండా తదుపరి చర్యలు యథావిధిగా జరగడం ద్వారా తమకు ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని నిరూంచే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు బీజేపీ నాయకులు జగన్ చర్యను తీవ్రంగా ఖండించడమే దీనికి ఒక ఉదాహరణ.అతి త్వరలో , రాబోయే వారంలో జరిగే కొన్ని పరిణామాలు జగన్ ఒంటరి అనే విషయాన్ని నిరూపించబోతున్నాయట.