ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అవసరమైన అంశాలపై చర్చించి శాసనాలు చేసే వారు.
అది ఒకప్పటి సంగతి.
కానీ ఇపుడు ఎమ్మెల్యేలు అంటే పార్టీ అధినేతలకు భజన పరులు మాత్రమే.
ఈ స్టేట్ మెంట్ ని స్వయంగా గర్వంగా ఒప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించని వారిలో అగ్రగణ్యుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి.
ప్రజలు ఏమనుకున్నా సంబంధం లేదు… జగన్ నా గురించి ఏమనుకుంటాడు అనేది మధు సూదన్ రెడ్డి కి కావాలి.
కరోనా టైంలో భారతి కటౌట్లు కట్టి ట్రాక్టర్లలో ఊరేగించి కరోనా వ్యాప్తికి తనవంతు కృషి చేసిన మధు సూదన్ రెడ్డి నేడు ఏకంగా జగన్ కి గుడి కట్టేశాడు.
ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తిలో క్రిస్టియన్ జాతీయుడు అయిన జగన్ కి ఈయన గుడి కట్టారు.
ఈ ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు మరియు కర్ణాటక నుండి నైపుణ్యం కలిగిన కళాకారులను తెప్పించి మరీ కట్టిస్తున్నాను అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఆయన.
ఈ గుడికి నవరత్నాల నిలయం అని పేరు పెట్టారు. ఈ గుడిలో జగన్ నవరత్నాలు నవ స్తంభాలపై చెక్కబడి ఉన్నాయి.
ఈ జగన్ గుడి నిర్మాణానికి మధుసూధన్ రెడ్డి రూ .2 కోట్లు ఖర్చు చేశారు.
ఇది త్వరలో పర్యాటక ప్రదేశంగా వెలుగొందాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు గర్వంగా ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు మిధున్ రెడ్డి ఈరోజు ఆలయాన్ని ప్రారంభించారు.
ఏది ఏమైనా జగన్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినయం మాత్రమే కాదు, భయం.
జగన్ కోసం చావడానికి అయినా సిద్ధపడే మొండి కార్యకర్తలు ఎక్కడ తమను బతకనివ్వరేమో జగన్ గురించి పొరపాటును కూడా వారు విమర్శించరు. ఆ భయంలోంచి వచ్చిన వినయం పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
https://twitter.com/27dots_/status/1426928657658900481
గుడి బదులు జగన్ పేరు మీద ఏదైనా బడి లేక అనాధ ఆశ్రమం కట్టి వుంటే బాగుండేది..ఈ గుళ్ళు,గోపురాలు ఎందుకయ్యా..జగనన్న పడిన కష్టమంతా ఇలాంటి పనుల వల్ల బురదపాలు అవుతుంది..hope u understand @BiyyapuMadhu @pavithrabiyyapu https://t.co/cXXmNjFVvU
— ???? ???? ???? (@KKMUSK_003) August 16, 2021
ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటలు జగన్ భజనలో ఉన్నారమ్మ,
ఇంక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే @BiyyapuMadhu రెడ్డి ఒక అడుగు ముందుకువేసి జగన్ కు గుడి కూడా కట్టాడు…@RojaSelvamaniRK ????????@SucharitaYSRCP ???????? https://t.co/bctwL16Vdp pic.twitter.com/zgwchyXwKn— The Protagonist (@KalyanForever_) August 15, 2021