• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బటన్‌ నొక్కుడులో జగన్‌ మాయాజాలం

NA bureau by NA bureau
November 6, 2021
in Politics, Top Stories
0
బటన్‌ నొక్కుడులో జగన్‌ మాయాజాలం
0
SHARES
416
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
  • చిన్న పరిశ్రమలకు భలే ప్రోత్సాహకం!
  • రూ.1,124 కోట్లకు 450 కోట్లే మంజూరు
  • అందులోనూ పైసా కూడా ఇవ్వని వైనం

బటన్‌ నొక్కి పారిశ్రామిక రాయితీలు విడుదల చేసేశాం.. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల కింద రూ.450 కోట్లు వేసేశాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలే అందులో 62శాతం మంది ఉన్నారు…అని ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు.

ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా కోట్ల రూపాయలతో పత్రికా ప్రకటనలు ఇచ్చి.. ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటుచేసి బటన్‌ నొక్కారు. కానీ ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లోకి ఆ డబ్బులు పడలేదు. సాధారణంగా బటన్‌ నొక్కిన 24 గంటల్లో డబ్బులు జమవుతాయి. ముఖ్యమంత్రి మూడో తేదీన బటన్‌ నొక్కారు. అంటే నాలుగో తేదీకల్లా డబ్బులు జమ కావాలి. కానీ 14వ తేదీకి కూడా విడుదల కాలేదు.

ప్రోత్సాహకాలతోనైనా సమస్యల సుడిగుండం నుంచి బయటపడదాం అని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల యజమానులకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఒకపక్క నెలవారీ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల చెల్లింపు చేయలేక.. ప్రోత్సాహకాలు వస్తాయి.. అందులో నుంచి తీసేసుకోండని రెండు నెలల నుంచి వాటికి చెబుతున్నారు.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 26వ తేదీన ప్రోత్సాహకాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించింది. దీంతో ఆగస్టు వాయిదాను ప్రోత్సాహకాలు వచ్చిన వెంటనే తీసేసుకోండని పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ఆగస్టులో ప్రోత్సాహకాలు రాలేదు. సెప్టెంబరు మూడున ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేసేసింది.

ఇక మీ రుణ వాయిదాలకు ఇబ్బంది ఉండదని పారిశ్రామికవేత్తలు వాటికి ధీమాగా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి బటన్‌ నొక్కినా ఇంకా డబ్బులు మాత్రం ఖాతాల్లోకి రాలేదు. ఇదే కాదు.. విద్యుత బిల్లులు చెల్లిస్తే తప్ప ప్రోత్సాహకాలకు అర్హులు కాదని మెలిక పెట్టడంతో.. అప్పో సప్పో చేసి ఎంఎస్‌ఎంఈ యూనిట్ల యజమానులు వాటిని కట్టేశారు.

గ్రానైట్‌ యూనిట్లు ఉన్నవారైతే దాదాపు రూ.10లక్షల వరకు విద్యుత బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఇంకా చిన్న యూనిట్‌దారులు కూడా కనీసం రూ.70వేల నుంచి రెండు లక్షల వరకు విద్యుత బిల్లులు చెల్లించారు. అసలే కరోనా.. తగ్గిన సరుకు డిమాండ్‌ నేపథ్యంలోనూ ప్రోత్సాహకాలు వస్తే ఏదోరకంగా పరిశ్రమను ముందుకు నడిపిద్దామన్న ఉద్దేశంతో అందినకాడికి అప్పులు చేసి ఈ విద్యుత బిల్లులు కట్టారు. కానీ ఇప్పుడు సీఎం బటన్‌ నొక్కినా ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇందులోను అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్దిదారులే ఉన్నారు.

నిధుల్లేక!

వాస్తవానికి ఇప్పుడు ప్రోత్సాహకాల జాబితాలో అనుమతి పొందిన ఎంఎస్‌ఎంఈ యూనిట్‌దారులకు గత ఏడాదే ప్రోత్సాహకాలు రావాల్సి ఉన్నా రాలేదు. కొవిడ్‌ ఎదురవడంతో వీరంతా అల్లాడిపోయారు. అయినా ఏదోరకంగా తిప్పలు పడుతూ పరిశ్రమలను నడిపించారు.

ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేశామని చెప్పాక కూడా ప్రోత్సాహకాలు పడకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. దీనిపై పరిశ్రమల శాఖ అధికారులను అడిగితే రకరకాల సమాధానాలు వస్తున్నాయి. సీఎఫ్‌ఎంస్‌లో సమస్య అని ఒకసారి, కొద్దిరోజుల్లో పడిపోతాయని ఇంకోసారి చెబుతున్నారు. అనధికారికంగా మాత్రం నిధులు లేవని చేతులెత్తేసినట్లు తెలిసింది.

చేతిలో డబ్బు లేనప్పుడు ఇస్తామని ఎందుకన్నారు.. సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలు ఎందుకిచ్చారన్నది ప్రశ్న. నిజానికి ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అందులోనూ కోతపెట్టింది. రూ.680 కోట్లు మాత్రమే విడుదల చేసి.. మిగ తా రూ.444 కోట్లను భవిష్యతలో ఆయా పరిశ్రమలు చెల్లించే విద్యుత బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని మెలిక పెట్టింది.

ఆ 680 కోట్లలోనూ రూ.450 కోట్లు నేరుగా ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లోకి వె ళ్లాయని.. టెక్స్‌టైల్స్‌ మిల్స్‌కు కూడా రూ.230 కోట్లు బటన్‌ నొక్కి విడుదల చేశామని సీఎం చెప్పారు. అయితే మిల్స్‌కు మాత్రం విద్యుత బిల్లుల్లో సర్దుబాటు చేస్తామన్నారు.

Tags: andhrapradeshjagan failuresycpycp ruleYSRCP
Previous Post

రీయింబర్స్‌పై జగన్నాటకం!

Next Post

ఎమ్మెల్సీ తలనొప్పి – కారు.. ఓవర్ లోడ్

Related Posts

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
Andhra

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?

May 16, 2022
బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
Movies

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

May 16, 2022
టీడీపీలోకి ఆ మాజీ మంత్రి?..చంద్రబాబుతో భేటీ
Andhra

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్

May 16, 2022
ప‌వ‌న్‌పై వైసీసీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ టార్గెట్ ?
Andhra

ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !

May 16, 2022
ఆ నేతలకు క్లాసు పీకిన చంద్రబాబు
Andhra

కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్

May 16, 2022
అల్లు అరవింద్ పై బాలయ్య షాకింగ్ కామెంట్లు
Movies

ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1

May 16, 2022
Load More
Next Post
ఎమ్మెల్సీ తలనొప్పి – కారు.. ఓవర్ లోడ్

ఎమ్మెల్సీ తలనొప్పి - కారు.. ఓవర్ లోడ్

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds