జీవితమే `క్విడ్ ప్రోకో` అంటారు తత్వవేత్త కృష్ణమూర్తి. `నువ్వు నాకిస్తే.. నేను నీకిస్తా` అనేది దీని సారాంశం. ఇది వ్యక్తిగత జీవితాల నుంచి రాజకీయాల వరకు అప్లయ్ అవుతుంది. దీనిలో మరో మాటే లేదు. ఎక్కడా తేడా కూడా ఉండదు. ఇప్పుడు వైసీపీ విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. జగన్ కోసం ఒకప్పుడు నిలబడిన జనం .. ఇప్పుడు ఉన్నారా? అనేది ప్రశ్న. ఒకప్పుడు జగన్ కోసం బయటకు వచ్చారు. ఆయనను గెలిపించారు. కానీ, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడించారు.
ఇక, ఇప్పుడు ఎవరు ఎవరి కోసం నిలబడాలనేది ప్రశ్న. 2019లో జగన్ కోసం జనం నిలబడ్డారు. 2024లో రివర్స్ అయింది. దీనికి కారణం.. 2019-24 మధ్య జనం కోసం జగన్ నిలబడ్డారా? అనేది ప్రశ్నార్థకం కావ డమే. ఇదే ఫలితం ఎన్నికల్లోనూ కనిపించింది. అయితే.. ఇప్పుడు అదే జగన్ జనం కోసం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. గత నాలుగు మాసాల్లో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని ఆధారం చేసుకుని ప్రజల పక్షాన గళం వినిపించాల్సిన బాధ్యత జగన్‌పైనే ఉంది.
కానీ, ఈ విషయంలో జగన్ ఏమేరకు సక్సెస్ అయ్యారనేది జనం నోటి నుంచే వినిపిస్తోంది. విశాఖ ఉక్కు కోసం.. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒకే సారి 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. దీనిపై జగన్ స్పందిస్తారని అక్కడివారు ఎదురు చూశారు. కానీ, షర్మిల వెళ్లిం దే కానీ.. జగన్ కనిపించలేదు. వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారిని పలకరిస్తే.. జగ న్కు పోయేది ఏమీ లేదు. పైగా సింపతీ అయినా వచ్చి ఉండేది.
కానీ, జగన్ ఎక్కడా పలకరించిన పాపాన పోలేదు. వలంటీర్లను ఇప్పటికీ ప్రబుత్వం తీసుకోలేదు. వీరి కోసం జగన్ బహిరంగంగా పన్నెత్తు మాట మాట్లాడింది లేదు. రేషన్ వాహనాల డ్రైవర్లు రోడ్డున పడ్డారు. వీరి పక్షాన కూడా జగన్ నోరెత్తలేక పోయారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. మరి జగన్ ఎవరి కోసం నిలిచారు? అనేది ప్రశ్న. ప్రజల కోసం పనిచేయని నాయకుడు, ప్రజల సమస్యలు పట్టించుకోని నాయకుడు.. ప్రజల మన్ననలు ఎలా పొందుతారన్నదే ప్రశ్న. మొత్తంగా ఎలా చూసినా.. జగన్ జనం కోసం నిలబడుతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు.