జగన్ ది బైబిల్ సెంటిమెంట్ ... మాది రాముడి సెంటిమెంట్ - చంద్రబాబు

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన ఏపీతోపాటు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలోల రామతీర్థంలోటీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్న వైనంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
#CBNForRamaTheertham#SaveAPTemples@ncbn
— iTDP Official (@iTDP_Official) January 2, 2021
ప్రజలు తిరగబడితే, పారిపోతావ్ జగన్ రెడ్డి : చంద్రబాబు. pic.twitter.com/CgJ2HUYW5M
విజయసాయిరెడ్డిని కొండపై ఆలయంలోని గర్భగుడిలోకి అనుమతించిన ఆలయాధికారులు, చంద్రబాబును మాత్రం అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, దేవుడితో పెట్టుకుంటే దేవుడే శిక్షిస్తాడని జగన్ ఒక ప్రకటన చేసి ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారన్న విమర్శలుల వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. శ్రీరాముడిని కాపాడే బాధ్యత సీఎం జగన్‌కు లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి జగనే కారణమని దుయ్యబట్టారు.
తన హయాంలో మసీదు, చర్చిలపై దాడులు జరగలేదని, దేశమంతా జై శ్రీరామ్ అంటోంటే ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాంలో రామరాజ్యం చూశామని, జగన్ 19 నెలల పాలనలో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని, ఈ సీఎంని నరరూప రాక్షసుడు అనాలా?.. ఏమనాలి? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలీసులు తమాషాలు చేస్తున్నారని, అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారని, పోలీసులు తన ముందు తోక తిప్పుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ లాంటి చోటామోటా నాయకుల నాటకాలు చాలా చూశామని, ఇది పులివెందుల రాజకీయం కాదని చురకలంటించారు. బాబాయ్‌ని చంపినా అడిగేవారు లేరనుకుంటున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలిపారు.
సీఎం జగన్‌కు బైబిల్ సెంటిమెంట్ ఉన్నట్లే.. మనకు వెంకటేశ్వరస్వామి సెంటిమెంట్స్ ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఒక మతస్తుడు మరో మతాన్ని గౌరవించి తీరాలని అన్నారు. తిరుమల కొండపై ఒక ఎమ్మెల్యే డ్రోన్ తిప్పుతాడని, ఎస్వీబీసీ ఛానల్లో ఓ నేత శృంగారం చేశాడని మండిపడ్డారు. టీటీడీ ఆస్తుల్ని వేలం వేయాలని చూశారని, మనల్ని కాపాడే దేవుడిని మనం కాపాడుకోలేమా? అని ప్రశ్నించారు.
సీఎం హోదాలో ఉండి మత మార్పిడులు చేయాలనుకోవడం ద్రోహం అని, కేవలం ఒక మతానికే కొమ్ము కాస్తారా?...అని చంద్రబాబు ప్రశ్నించారు. విగ్రహాలు చోరీ అయితే ఏమైతుందని బూతుల మంత్రి అన్నాడని చంద్రబాబు మండిపడ్డారు.
దేవాలయాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని, దేవుడి ఆస్తుల దగ్గరికి వస్తే ఖబడ్దార్.. మసైపోతారని హెచ్చరించారు. గోశాలలను కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్క కేసును రీఓపెన్ చేయిస్తానని, తప్పుడు కేసులు పెట్టినవారికి శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముడి విగ్రహం పరిశీలనకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన సందర్భంగా రామతీర్థం కొండ వద్దకు చేరుకున్న అశేషప్రజానీకం.#CBNInVizianagaram pic.twitter.com/OXwsMY5cFr
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) January 2, 2021
రామతీర్థం చేరుకున్న టీడీపీ అధినేత @ncbn. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రామతీర్థం చేరుకున్న చంద్రబాబు#CBNInVizianagaram pic.twitter.com/u9BlxruKMi
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) January 2, 2021