ఏపీ సీఎం జగన్… తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా సీబీఐ అధికారులనే కొనేశారా? వారికి కూడా లంచాలు ఇచ్చి.. తన దారిలోకి తెచ్చుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీకే చెందిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు. తాజాగా రఘురామకృ ష్ణరాజు కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..
“సీబీఐ డెరెక్టర్.. రుషికుమార్ శుక్లా(రెండున్నర నెలల కింద ఆయన రిటైరయ్యారు)ను ఆరు మాసాల కిందట నేను కలిశా. అయితే.. దీనికి ముందు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్, సీఎం జగన్ కలిసి ఒక కంప్టయింట్ ఇస్తే.. 24 గంటల్లోనే రుషి కుమార్ శుక్లా ఎఫ్ ఐఆర్ కట్టారు. ఇదే విషయాన్ని నేను శుక్లాను ప్రశ్నించాను. 24 గంటల్లోనే కేసు ఎలా నమోదు చేశారు? మీ అధికారులు అమ్ముడు పోయారు! అని నిలదీశా! దీనిపై విచారణ చేయండి.. అని చెబుతూ.. ఇదే సమయంలో 2010-11లో ఇదే వల్లభనేని బాలశౌరి.. 38 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు. స్వగృహ కంపెనీ పురుషోత్తం నాయుడు ద్వారా ఈ లావాదేవీ జరిగింది“ అని రఘురామ పేర్కొన్నారు.
ప్రస్తుతం పురుషోత్తం నాయుడు జగన్ మీడియా అయిన సాక్షిలో అతిపెద్ద వాటాదారుగా ఉన్నట్టు రఘురా మ రాజు పేర్కొన్నారు. ఈ సొమ్ము.. పూర్తిగా లంచమేనని.. ఈ విషయం గతంలోనే వెలుగు చూసినా.. అప్ప టి జేడీ లక్ష్మీనారాయణ 11-12 చార్జ్ షీట్లు దాఖలు చేసినా.. ఈ విషయం ఎక్కడో మిస్సయిందని.. రఘురా మ పేర్కొన్నారు. దీనిపైనే వివరంగా విచారణ చేయాలని రుషికుమార్ శుక్లాను కోరితే.. ఆరు నెలలైనా.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే.. అప్పట్లోనే సెక్షన్ 153 ప్రకారం దీనిపై కూడా విచారణ చేయాలని హైకోర్టు పేర్కొందని తెలిపారు.
ఈ 38 కోట్ల రూపాయల లంచానికి సంబంధించిన ప్రత్యేక విచారణ కూడా అవసరంలేదని.. లెక్కలన్నీ ఉన్నాయని.. రఘురామరాజు తెలిపారు. ఇక, ఏడాదిన్నరకాలంగా జగన్ కోర్టుకు వెళ్లకపోయినా.. ప్రశ్నించకపోవడానికి.. కారణం.. రుషికుమార్ శుక్లా-జగన్‌ల మధ్య ఉన్న లావాదేవీలే రీజనని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వల్లభనేని బాలశౌరి ద్వారా.. రుషికుమార్-జగన్(ఏ1)-సాయిరెడ్డి(ఏ2)ల మధ్య వీడియో కాన్ఫరెన్స్ సాగినట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టుకు ఏడాదిన్నరగా రాకపోయినా.. జగన్‌ను సీబీఐ ప్రశ్నించలేక పోతోందన్నారు. ఇక, ఈ నెల 17న జరగనున్న విచారణలోకూడా రుషికుమార్ శుక్లా ప్రభావం ఏమేరకు ఉంటుందో.. చూడాలని వ్యాఖ్యానించడం గమనార్హం.