ఆ నాలుగు రాష్ట్రాలు పొమ్మన్న పోక్సోకు జగన్ 'రెడ్(డ్డి)' కార్పెట్ వేశారు

ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా కాకరేపుతోన్న సంగతి తెలిసిిందే. విశాఖ ఉక్కును పోక్సో కంపెనీకి బేేరం పెట్టడంలో సీఎం జగన్ దే కీలక పాత్ర అని విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ఈ డీల్ ను ప్రతిపాదించిందని...దానికి జగన్ ఓకే చెప్పారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే పోక్సో కంపెనీ గురించిన పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. పోక్సో ఇండియా పేరుతో మన దేశంలో పాగావేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (పోస్కో) విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి బయటకు వచ్చింది.
మనదేశంలో పాగా వేయాలని పోస్కో ఇండియా పేరుతో 16 ఏళ్లుగా ప్రయత్నిస్తోందట. ఒడిశాలో రూ.52 వేల కోట్లతో 12 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంటు పెడతామని 2005లో ఒరిస్సా సర్కార్ తో పోక్సో ఒప్పందం చేసుకుంది. కానీ, ఆ రాష్ట్ర చట్టాలు విధించిన  పర్యావరణ నిబంధనలను పాటించడానికి మాత్రం పోస్కో ఆసక్తి చూపలేదు. దీంతో, అక్కడ ప్లాంటు పెట్టలేమని పోక్సోనే ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్‌ లో పాతుకుపోవాలని వెళ్లిన పోక్సోకు అక్కడ చుక్కెదురు కావడంతో...ఆ తర్వాత కర్ణాటక వైపు దృష్టి సారించిందీ సంస్థ. అయితే, ఒకేచోట పోక్సో కోరినట్టు వేలాది ఎకరాలు ఇవ్వలేమని, వివిధ జిల్లాల్లో సమకూరుస్తామని కర్ణాటక ప్రభుత్వం చెప్పడంతో పోక్సో సైలెంట్ అయింది.
ఇక, జార్ఖండ్‌లోని బొకారోలో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)తో కలిసి జాయింట్‌ వెంచర్‌ కింద రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఒక ప్లాంటు పెట్టాలని యత్నించిన పోస్కో....విజయం సాధించలేకపోయింది.
ఇలా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఛీపొమ్మన్న పోక్సో కన్ను  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారంపై పడింది. భారత్ లో ఏకైక సముద్రతీర స్టీల్‌ ప్లాంటు కావడం, ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉండడంతో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని పోక్సో యాజమాన్యం భావించింది. ీ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న పోక్సో ప్రతినిధులు....ఆ తర్వాత జగన్‌ సర్కారుతో చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.
సాధారణంగానే క్విడ్ ప్రోకోలో ఆరితేరిన జగన్...కేంద్రం కూడా పోక్సోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సంస్థ ప్రతినిధులకు జగన్ రెడ్ కార్పెట్ వేశారు. విశాఖలో రూ.40 వేల కోట్ల విలువ చేసే 4 వేల ఎకరాల భూమిని జగన్ సర్కార్ ఇస్తే...5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్‌ షీట్లు కంపెనీ ఏర్పాటుకు పోస్కో డీల్ ప్రతిపాదించింది. జాయింట్‌ వెంచర్‌ కింద విశాఖ స్టీల్‌ భూములిస్తే...మూలధనం, టెక్నాలజీని పోక్సో అందిస్తుంది. దీంట్లో 50 శాతం వాటా పోస్కోకు వెళుతుంది.

ఇటువంటి సరసమైన డీల్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. దీంతో, ఈ రహస్య ఒప్పందం గత ఏడాది అక్టోబరు 29న జరిగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి, ఆరోజు పోక్సో ప్రతినిధులతో జగన్ మర్యాదపూర్వక భేటీ మాత్రమే అయ్యారని, రాష్ట్ర్రంలో పెట్టుబడులు పెట్టేందుకు....ఇంకా చెప్పాలంటే కడప స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడిపై చర్చకు ఈ భేటీ జరిగిందని ప్రచారం జరిగింది.
అయితే, ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తాం...అమ్మేస్తాం అంటూ కేంద్రం ప్రతిపాదించడం...దానిపై జగన్ సర్కార్...తూతూ మంత్రంగా లేఖ రాసి చేతులు దులుపుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో, అసలు చీకటి ఒప్పందం బయటపడకుండా ఉండేందుకు వైసీపీ నేతలు కూడా ఉద్యమంలో చేరారన్న టాక్ వస్తోంది. మరి, విశాఖ ఉక్కును తుక్కు చేయాలనుకుంటోన్న పోక్సో చరిత్ర తెలిసి కూడా జగన్ దానికి లొంగిపోయారంటే మన రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం చేసుకుందో ఇట్టే అర్థం కాక మానదు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.