ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు తన తీర్పును సెప్టెంబర్ 15 వ తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పు ఏమై ఉంటుందా అని ఎదురుచూస్తున్న యావత్ ఆంధ్రప్రదేశ్లోని అనేక మందిని సిబిఐ కోర్టు నిరాశపరిచింది.
ఎందుకంటే ఈ తీర్పుపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఏపీలో ప్రజలు భారీ బెట్టింగ్లు కాశారు. వారికి తీవ్ర నిరాశ కలిగించిన నిర్ణయం ఇది.
వారి సంగతి పక్కన పెడితే ఈ కేసులో ఒక కీలక ప్రకటన వెలువడింది. దీనిని ఎవరూ ఊహించలేదు. వైసిపి నెం.2గా ఫీలయ్యే విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుకు రఘురామరాజు పిటిషను వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ని కూడా సిబిఐ కోర్టు పరిశీలిస్తున్నది. వీరిద్దరు ఒకే కేసులో నిందితులు. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడి తీర్పు ఇస్తామని కోర్టు అందరికి షాక్ ఇచ్చింది.
దీంతో జగన్ మరియు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లు సెప్టెంబర్ 15 న నిర్ణయించబడతాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు వంటి నిర్ణయం వస్తుందా? లేక సీబీఐ కేంద్రం చేతిలో పావురంలా పరోక్షంగా తన వాదన వినిపించకుండా నిందితులకు దోహదపడిందా అన్న విషయం త్వరలో తేలనుంది.
మిగతా అందరి సమస్య ఒకటైతే… జగన్, విజయసాయి రెడ్డికి ఇది పెద్ద తలనొప్పి. ఆయన అభిమానులకు భారీ టెన్షన్. వారు ఇప్పటికే టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. సీబీఐ కోర్టు తాజా వాయిదా వారిలో టెన్షన్ ను మరింత పెంచినట్లయ్యింది.