అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ వస్తున్నారు…ఇంక సభలో మంటపుట్టిస్తారు…10 నిమిషాలు మైక్ ఇస్తే చాలు కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేస్తారు..కాచుకోండి..అంటూ వైసీపీ సోషల్ మీడియా జగన్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. ఆ ఎలివేషన్ కు తగ్గట్లే జగన్ సభకు కేజీఎఫ్ లో రాఖీ భాయ్ రేంజ్ ఎంట్రీ ఇచ్చారు. కట్ చేస్తే….సభకు ఎంత స్పీడ్ గా జగన్ వచ్చారో..అంతే స్పీడ్ గా వాకౌట్ చేసి వెళ్లిపోయారు. పోతూ పోతూ తన 10 మంది ఎమ్మెల్యేలను కూడా వెంటబెట్టుకొని వెళ్లారు. దీంతో, జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుబెట్టారు. 5 నిమిషాలు సైలెంట్ గా ఉన్న వైసీపీ సభ్యులు..ఒక్కసారిగా క్లాస్ రూంలో పిల్లల మాదిరి లేచి గోల చేయడం మొదలుబెట్టారు. ప్రతిపక్ష హోదా కావాల్సిందే..ఇవ్వాల్సిందే…అంటూ నినాదాలు చేశఆరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సభలో గందరగోళం సృష్టించారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలారు.
తాము వచ్చిన పని అయిపోయింది అనుకున్న తర్వాత శాసన సభ నుంచి జగన్ తో పాటు వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి జగన్ అండ్ కో సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో, ఇదేనా ప్రజా సమస్యలపై చర్చ అంటూ జగన్ పై, జగన్ కు ఎలివేషన్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్ర గవర్నర్ చెప్పేది వినే ఓపిక లేని వీళ్లు..ప్రజా సమస్యలపై ఏం మాట్లాడతారని ఎద్దేవా చేస్తున్నారు. కేవలం హాజరు పడాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ రోజు జగన్ సభకు వచ్చారని, మరో 60 రోజులు డుమ్మా కొట్టేందుకే ఈ రోజు ప్రజెంట్ సార్ అని హాజరు వేశారని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా…60 రోజులు ఆబ్సెంట్ అయితే సస్పెండ్ చేస్తానని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇచ్చిన వార్నింగ్ కు జగన్ భయపడి సభకు వచ్చారని నెటిజన్లు అంటున్నారు. రఘురామ వార్నింగ్ కు జగన్ భయపడ్డారనేందుకు ఇదే ప్రూఫ్ అని కామెంట్లు చేస్తున్నారు.