అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు చిప్పకూడు తప్పదని, ట్రంప్ ను కటకటాల్లోకి నెట్టేందుకు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా క్యాపిటల్ బిల్డింగ్ పై ఆయన అనుచరుల దాడి ఘటన ఒక్కటి చాలని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టి ఆ దాడికి పురిగొల్పారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతోపాటు సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్ నకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రంప్ నకు శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పదని ప్రచారం జరుగుతోంది.
ఆ దాడి ఘటనలో ట్రంప్ పాత్ర నిజమని నిరూపితమైతే ఆయనకు జైలుశిక్ష తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ దోషి అని తేలితే శిక్ష తప్పదని, అదే జరిగితే ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటళ్ళు, గోల్ఫ్ రిసార్ట్ లు కూడా చిక్కుల్లో పడతాయని చెబుతున్నారు. అయితే, ట్రంప్ నకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆయన మద్దతుదారులు విశ్వప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ ను ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ ఇరకాటంలో పడేసింది. ఆ దాడి ఘటనపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన న్యాయ విచారణ కమిటీ ముందు ఇవాంకా సంచలన విషయాలను వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఇవాంకా మాట్లాడిన వీడియోను ఆ కమిటీ తాజాగా విడుదల చేసింది. ఎన్నికలు కుట్రపూరితంగా జరిగాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అవాస్తమనని అటార్నీ జనరల్ బ్రార్ చేసిన వ్యాఖ్యలను రెస్పెక్ట్ చేస్తున్నట్లు ఇవాంక్ చెప్పిన వీడియో ఇపుడు అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది.
దాంతోపాటు, ఛైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మిల్లే కూడా తన టెస్టిమెనీలో కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి జరుగుతుందని చెప్పినా ట్రంప్ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదని ఆనాటి త్రివిధ దళాధిపతి కూడా పేర్కొనడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డట్లయింది. పరిస్థితి చేయిదాటితుందనగా ఆనాటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం నేషనల్ గార్డ్స్‌ను పంపేందుకు అనుమతిచ్చారని తెలిపారు.