ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ కావడంతో ఘటనా స్థలంలోనే ఆయనతోపాటు హెలికాప్టర్ లోని పైలెట్, ఇతరులు చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్దొల్లాహియన్ సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద స్థలంలో ముక్కలైన హెలికాప్టర్, ఘటనా స్థలిలో పరిస్థితికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేసింది.
ఆదివారం సాయంత్రం అజర్ బైజాన్ సరిహద్దులోని ఓ డ్యామ్ ను ప్రారంభించిన రైసీ తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. భారీ వర్షం, పొగమంచు వల్ల హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎక్కడ ఉంది అని గుర్తించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలకు వర్షం, ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారాయి. దట్టమైన అడవుల్లో వర్షంలో గాలింపు చర్యలు ఇబ్బందికరంగా మారాయి. మానవరహిత విమానాల సాయంతో ప్రమాద స్థలిని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైెఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే రైసీ కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు.
BREAKING: RESCUERS HAVE REACHED THE CRASH SITE OF THE PRESIDENT OF IRAN RAISI
“The presence of the rescue team at the crash site of the helicopter carrying the president
Additional and Unfortunately, there is a possibility of martyrdom of all the passengers of the helicopter.“ pic.twitter.com/4whDrc3iHZ
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 20, 2024