• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మూడేళ్లు ఏం పీక్కున్నారు?..ఏకిపారేసిన ఏబీ వెంకటేశ్వరరావు

admin by admin
May 19, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
561
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై సస్పెన్షన్ ను ఎట్టకేలకు జగన్ సర్కార్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల‌కు పైగా సస్పెన్ష‌న్‌లో ఉన్న ఏబీవీ…సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ తాను తప్పు చేయలేదని నిరూపించుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం జీఏడీలో రిపోర్ట్ చేసిన ఏబీవీ ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో త‌న మీద సజ్జల చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇచ్చిన ఏబీవీ…మూడేళ్లుగా ఏం పీక్కున్నారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తానేదో త‌ప్పు చేశాన‌ని చెబుతున్న వారు.. ఆ త‌ప్పు ఏమిటో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయింద‌ని, స‌మ‌యం ముగుస్తోంద‌ని కూడా స‌జ్జ‌ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. జీతాలివ్వకుండా చాలామంది పోలీసుల‌ను ఏళ్ల త‌ర‌బ‌డి వీఆర్‌లో పెట్టార‌ని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, కానీ, నేను చేసిన త‌ప్పును నిర్ధారించి శిక్ష అమ‌లు చేయాల‌ని అన్నారు.

75 ఏళ్ల వ‌య‌సులో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం కింద‌ కేసు న‌మోదు చేయాలని గతంలో కొందరు ప్రయత్నించారని, అటువంటి పోలీసులను తాను వారించాన‌ని గుర్తు చేసుకున్నారు. తాను విప‌క్షానికి వ‌త్తాసు ప‌లుకుతున్నానంటూ ఆరోప‌ణ‌లు చేయడం సరికాదన్నారు. త‌న స‌స్పెన్షన్‌ ఎత్తివేత ఉత్త‌ర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని, దానిపై చర్చించేందుకు సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌ను క‌లవాలనుకున్నానని అన్నారు.

కానీ, త‌న‌ను క‌లిసేందుకు సీఎస్ స‌మీర్ శ‌ర్మ విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో జీఏడీలో రిపోర్ట్ చేశాన‌ని మీడియాకు వెల్లడించారు. రిపోర్ట్ చేయ‌డం త‌న ప‌ని అని, పోస్టింగ్ విష‌యం ప్ర‌భుత్వ ప‌రిధిలోనిదని అన్నారు. కానీ, తాను ఏం త‌ప్పు చేశానో నిగ్గు తేల్చాల‌ని  ఆయ‌న డిమాండ్ చేశారు. మరి, ఈ నేపథ్యంలో ఏబీవీకి ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందా…ఇస్తే ఎప్పుడిస్తుంది…ఏ పోస్ట్ ఇస్తుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

Tags: abv reported in gadabv shocking commentsabv's suspension revokedips ab venkateswara raono posting for ab venkateswara raosajjala ramakrishna reddy
Previous Post

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్

Next Post

జగన్ ను సెంట్రల్ జైలుకెళ్లమంటోన్న ఉండవల్లి

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post

జగన్ ను సెంట్రల్ జైలుకెళ్లమంటోన్న ఉండవల్లి

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra