దక్షిణ కొరియా డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ `స్క్విడ్ గేమ్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కథ..కథనం హీరో గా హ్వాంగ్ డాగ్ హ్యూక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ర్యాంకింగ్‌నే మార్చేసింది. అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా ఎన్నో రికార్డులు నెలకొల్పిన స్క్విడ్ గేమ్ కు కొనసాగింపుగా ఇటీవలె సీజన్ 2 కూడా వచ్చింది. తొలి వారంలోనే సీజన్ 2 ఏకంగా 68 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అదిరిపోయే ట్విస్టులతో సాగే ఈ సీరిస్ లో వయొలెన్స్ ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే స్క్విడ్ గేమ్ సీజన్ 3 కూడా రాబోతోంది.
అయితే ఎంతో ప్రజాదరణ పొందిన స్క్విడ్ గేమ్ లో మన ఇండియన్ స్టార్ పాల్గొంటే ఎలా ఉంటుంది..? స్క్విడ్ గేమ్ డ్రెస్ కోడ్ లో హీరోలు ఏ విధంగా ఉంటారు..? ఒకవేళ స్వ్కిడ్ గేమ్ లో నటించి టాలీవుడ్ హీరోలు ఒకరినొకరు చంపుకుంటే? అనే ఆలోచనతో ఓ ఔత్సాహిక టెక్ నిపుణుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, నాగచైతన్య, అల్లు అర్జున్, ధనుష్, విజయ్ దేవరకొండ, దళపతి విజయ్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, ప్రభాస్, రానా, హృతిక్ రోషన్, విక్రమ్, యశ్ ఇలా చాలా మంది హీరోలు ఆటగాళ్ల దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు.
`ఒకవేళ వీళ్లంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్క్విడ్గేమ్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి` అనే క్యాన్సన్ తో సదరు టెక్ నిపుణుడు ఈ ఏఐ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోకు విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. ఏముందయ్యా వీడియో.. ఏఐతో ఇలాంటి అద్భుతాలు కదా చేయాల్సింది అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ఏఐ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This is INSANELY good! AI just outdid itself! 👏🔥#AI #SquidGame #ArtificialIntelligence #MachineLearning #GenAI pic.twitter.com/gkrZ65wTJs
— 𝐍𝐚𝐠𝐞𝐬𝐡 𝐏𝐨𝐥𝐮 (@nageshpolu) January 7, 2025