2007లో టీ20 ప్రపంచ కప్ తొలి ఎడిషన్ మొదలుబెట్టినపుడు భారత జట్టు అండర్ డాగ్ గా బరిలోకి దిగి విశ్వవేిజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచి 17 ఏళ్లు గడిచాయి. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనన్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. కట్ చేస్తే, 2024లో టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ చేరింది.
మరోవైపు, ఇప్పటిదాకా ఐసీసీ నిర్వహించే ఏ ప్రపంక కప్ టోర్నీ గెలవని దక్షిణాఫ్రికా భారత్ తో ఫైనల్ లో తలపడింది. ఈ క్రమంలోనే చివరి తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ను మట్టి కరిపించిన భారత్ టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడి 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ కు దిగిన అక్షర్ పటేల్ 47 పరుగులు చేసి సత్తా చాటాడు.
177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోికి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీకాక్ 37 పరుగు చేసి ఔటయ్యాడు. ఇక, క్లాసెన్ 27 బంతుల్లో 57 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాలని చూశాడు. ఆ సమయంలో క్లాసెన్ ను పాండ్యా అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో హార్దిక్ పాండ్యా 8 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. దీంతో, భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది.
దీంతో, భారత్ రెండో సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకొని వెస్టిండీస్, ఇంగ్లండ్ ల సరసన చేరింది. 2007లో ధోనీ నాయకత్వంలో, 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ పొట్టి క్రికెట్ లో విశ్వవిజేతగా నిలిచింది.