• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!

admin by admin
May 12, 2025
in Andhra, Top Stories
0
0
SHARES
34
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రోజు తిరుపతికి వస్తుంటారు. ఆల్రెడీ తిరుమలలో గతంలో పర్యటించిన భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్లు మొదలు బస చేసే టీటీడీ రూమ్ లు, బయట లాడ్జిల వరకు సమాచారం కొట్టిన పిండి. కానీ, కొత్తగా తిరుమలకు వచ్చేవారికి ఇక్కడి విధివిధానాలు, ఏ సమయంలో ఏ టోకెన్లు జారీ చేస్తారు, బస చేసేందుకు ఎంత సమయం ముందు బుకింగ్ చేసుకోవాలి వంటి విషయాలపై పూర్తిగా అవగాహన ఉండదు. ఒకవేళ కాస్తో కూస్తో అవగాహన ఉన్నా…వరుస క్రమంలో ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ కౌంటర్ దగ్గరకు ఏ సమయంలో వెళ్లాలి, ఏ పద్ధతి ప్రకారం పనులు చేస్తే దర్శనం త్వరగా అవుతుంది అన్న విషయాలపై కచ్చితమైన అవగాహన ఉండకపోవచ్చు. అటువంటి భక్తుల కోసమే ఈ విలువైన సమాచారం….

తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు

1) మాకు టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ?.

జ) మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి.

విష్ణు నివాసం , శ్రీనివాసం , భూదేవి కాంప్లెక్స్
లలో ముందు రోజు రాత్రి 9:00 నుండి కౌంటర్లు ప్రారంభమవుతాయి.

2) SSD టోకెన్లు అంటే ఏమిటి ?

జ) Time Slotted Sarva Darshan మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.

3) SSD టోకెన్లు లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి ?

జ) మీరు నేరుగా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించే చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 రద్దీ ఉన్న రోజుల్లో 16 నుండి 24 వరకు పట్టే అవకాశం ఉంటుంది.

4) మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా ?

జ) అలిపిరి మెట్లు మార్గంలో అయితే ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్ లు టోకెన్ తీసుకోవాలి.

శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులు మార్గమధ్యంలో టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది.

5) చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు కనిపిస్తారు

జ) ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. విశేష పర్వదినాల్లో దర్శనాలు రద్దు చేస్తారు.

6) చిన్నపిల్లల దర్శన్లు ఎవరెవరు వెళ్లవచ్చు ?

జ) చిన్నపిల్లలు ఒక సంవత్సరం లోపు వయసు కలిగి ఉండాలి . చిన్నపిల్లల యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లాడి యొక్క తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి

7) ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు.. కొండపైన రూమ్ దొరుకుతుందా ?

జ) ఖచ్చితంగా దొరుకుతుంది.CRO ఆఫీస్ వద్ద క్యూలైన్లోకి వెళితే గదులు ఖాళీలు బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది.

8) వయోవృద్ధులకు, దివ్యాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా ?

జ) ఉండదు . ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.

9) 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కొండపై దొరుకుతాయా ?

జ) దొరకవు.

10) బ్రేక్ దర్శనం లెటర్ పై ఎంత మంది దర్శనానికి వెళ్ళవచ్చు ?

జ) ఆరుగురు వెళ్లవచ్చు.

11) శ్రీవారి వాలంటరీ సేవా చేయాలంటే ముందుగా ఏం చేయాలి ?

జ) 15 మంది గ్రూపుగా ఏర్పడి … ఆన్లైన్లో అప్లై చేసుకుంటే శ్రీవారి సేవకు అర్హులు అవుతారు.

12) దర్శనం కోసం మీ సలహా ఏంటి ?

జ) ముందుగా ఆన్లైన్లో టికెట్లు , రూములు బుక్ చేసుకుని కొండపైకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అవుతుంది.

13) మా పిల్లలకు ఎన్ని సంవత్సరాలు దాటితే టిక్కెట్ తీయాలి ?

జ) 12 సంవత్సరాలు లోపు వారికి ఎటువంటి టిక్కెట్టు అవసరం లేదు… 12 సంవత్సరాల దాటితే కచ్చితంగా టికెట్ తీయాలి.

Tags: lord balajiperfect processsarvadarsanam tokensTirumalatirumala piligrimstirupati lord balaji darshan
Previous Post

యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌

Next Post

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

Related Posts

Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Load More
Next Post
modi

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra