భారతదేశపు దిగ్గజ సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు, రాజ్యసభ ఎంపీ ఇళయరాజా కు ప్రఖ్యాత ఆలయంలో అవమానం జరిగిందంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు, మండు వేసవిలో కూడా తన స్వరాలతో మంచు తెమ్మెరలు కురిపించగల సమర్థుడు ఇళయరాజా తాజాగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని అండాళ్, రంగమన్నార్లన్ దర్శించుకునేందుకు వెళ్లారు.
ఇళయరాజాతో పాటు చిన్నజీయర్ కూడా ఆలయంతో ఉండటంతో.. ఇద్దరూ కలిసి స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. అయితే గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపంలోకి ఇళయరాజా ప్రవేశించగా.. వెంటనే అక్కడ ఉన్న పూజారులు ఆయన్ను బయటకు పంపేశారు. చిన్నజీయర్ అర్థ మండపంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోగా.. ఇళయరాజా మాత్రం అర్థ మండపం మెట్ల దగ్గరే నిలబడి ఆలయ మర్యాదలను స్వీకరించడంతో పాటు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆలయ పూజారుల తీరు పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు, ఎన్నోసార్లు తన మాటలతో స్వామివారిని కీర్తిన వ్యక్తి అయినప్పటికీ.. ఒక దళిత కుటుంబంలో జన్మించారనే కారణంతో ఇళయరాజాను గర్భగుడిలోకి రావ్వలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని మారినా కొన్ని చోట్ల కుల వివక్ష మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇదే విషయంపై ఆలయ సిబ్బంది స్పందింది. కేవలం జీయర్లకు మాత్రమే అర్థమండపంలోకి ప్రవేశం ఉందని.. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులెవరూ ప్రవేశించకూడదని తెలిపారు. అనుకోకుండా ఇళయరాజా అర్థమండపంలోకి వచ్చేయడంతో.. సిబ్బంది గుర్తించి బయటకు పంపారని వివరణ ఇచ్చారు.
SHOCKING: Ilaiyaraaja denied entry✖️ to Sanctum Sanctorum and asked to get out by the priests at Srivilliputhur Andal Temple🛕 pic.twitter.com/Aii7GQPg6k
— Manobala Vijayabalan (@ManobalaV) December 16, 2024