“నేను ఎవరు పిలిచినా విచారణకు రాను. నాపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు రమ్మని ఆదేశిస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. ఎవరి భూమినీ ఆక్రమించలేదు. ఒకవేళ ఆక్రమించు కున్నట్టుగా ఆధారాలు ఏమైనా ఉంటే.. సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు“ అని వైసీపీ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తేల్చి చెప్పారు. తాజాగా ఆయనపై భూముల ఆక్రమణల కేసు నమోదైంది.
ఇటీవల రాజంపేటకు చెందిన టీడీపీ నాయకులు కొందరు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆకేపాటి భూములు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు చేశారు. వైసీపీ అధికా రంలో ఉన్నప్పుడు… ఆకేపాటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణ లు వచ్చాయి. తన యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆకేపాటి భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే.. భూములపై విచారణ జరిపించి చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ఈ క్ర మంలో కొన్ని రోజుల కిందట రాజంపేట టీడీపీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వచ్చి.. ఆకేపాటి భూమే తపై ఆధారాలతో సహా టీడీపీ ప్రజాఫిర్యాదుల విభాగంలో అందించారు. దీనిని పార్టీ నాయకులు.. సర్కారు దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్కు నివేదించింది. ఆయన దీనిపై విచారణ చేయాలంటూ.. జాయింట్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు.
ఈ క్రమంలోనే ఆకేపాటిని విచారణకు రావాలంటూ.. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు పంపించారు. తాజాగా ఈ విషయంపై ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరి భూమిని ఆక్రమించలేదన్నారు. విచారణ కురావాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. ఒకవేళ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్టు గుర్తిస్తే.. దానిని నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని ఆకేపాటి పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ నుంచి తనకు ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని తెలిపారు.