ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. తెలంగాణ, ఆంధ్ర విభజన గాయాలు కూడా దాదాపు మానిపోయి అందరూ నార్మల్ లైఫ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలనే తాను ముందు నుంచి కోరుకున్నాను
ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య. ఇపుడు ఈ వ్యాఖ్య ఎందుకు చేశారంటే ఆయన విజయవాడకు వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఎంత ఏపీకి వస్తే మాత్రం అందరూ మరిచిపోయిన విషయాన్ని, ప్రయోజనం లేని విషయం మాట్లాడటం వల్ల ఏపీకి ఏలాభం లేకపోగా తాను అనవసరంగా చెడ్డ అవుతున్నారు జగ్గారెడ్డి.
అయితే, తాను ఎందుకు అలా కోరుకున్నానో ఆయన చెప్పారు. సమైక్యాంధ్రలో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను దివంగత రాజశేఖరరెడ్డి సమానంగా అభివృద్ధి చేశారట. అయితే, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రులు, విడిపోవాలని తెలంగాణ వారు కోరుకున్నారు. అభివృద్ధి అంతటా ఉన్నపుడు ఎందుకు
కాంగ్రెస్ ను బతికించండి
ఏపీ ప్రజలకు జగ్గారెడ్డి వినతి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి నష్టం చేయలేదని, అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు కోపం వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల మంచే జరుగుతుందని… కాంగ్రెస్ ను బతికించండి అని కోరారు. కులాలు, మతాలను కలుపుకుని ప్రజలందరినీ ఏకం చేసే పార్టీ కాంగ్రెస్సే అని కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వాలని ఏపీ ప్రజలను జగ్గారెడ్డి కోరారు.