టీడీపీ నాయకులు మరోసారి తమ నోటికి పని చెప్పారు. “కిమ్ తర్వాత జగనే“ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక విశాఖకు చెందిన బండారు సత్యనారాయణ మూర్తి కూడా.. `కిమ్‌ను ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నా. కానీ, ఉత్తర కొరియా వెళ్లలేను. తాడేపల్లి వెళ్లొస్తా!“ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వైసీపీ అధినేత జగన్‌ను కిమ్‌తో పోల్చడం టీడీపీకి ఇప్పుడు కొత్తకాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో పోల్చారు.
అయితే.. ఇప్పుడు ఎందుకు మరోసారి కిమ్‌తో పోలిక పెట్టారంటే.. విషయం ఇక్కడే ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రజల మధ్య కు సీఎం జగన్ వెళ్లకతప్పదు. ప్రజల ఓట్లను అభ్యర్థించకా తప్పదు. ఇప్పుడంటే.. ఏవో కారణాలు చెప్పి.. పరదాలు కట్టుకుని.. వెళ్తున్నారు కానీ, ఎన్నికల సమయంలో పరదాలు కట్టుకుంటే ఆయనకే నష్టం కదా! అంటున్నారు టీడీపీ నాయకులు. ఈ క్రమంలోనే ఆయనకు రక్షణగా ఏకంగా మహిళా కమెండోలను సిద్ధం చేసుకుంటున్నారట.
ప్రస్తుతం 60 మందికి శిక్షణ ఇస్తున్నారని టీడీపీ నాయకులు ఫొటోలతో సహా మీడియాకు వెల్లడించారు. వీరంతా మహిళలు. వీరిలో కొందరు అవివాహితలు కూడా ఉన్నారు. బలమైన శారీరక ధ్రుఢత్వంతోపాటు.. కరాటే.. వంటి విద్యల్లోనూ వీరికి శిక్షణ ఇస్తున్నారట. సరే.. వీరి పని ఏంటి? అంటే.. వీరు సీఎం జగన్‌కు రక్షణగా ఉండడమేనని చెబుతున్నారు. అయితే.. ఎలానూ పోలీసులు ఉన్నారు కదా! అంటారా? అయితే.. మహిళలు సీఎం జగన్‌పై విరుచుకుపడితే.. అప్పుడు కమాండోలు పనిపడతారన్నమాట.
ఈ తరహా మహిళా కమెండలో భద్రత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మాత్రమే ఉంది. వారు ఎలాంటి పరిస్థితినైనా అలవోకగా ఎదుర్కొనే శిక్షణ ఇచ్చారు. దీంతో కిమ్ మీద ఆడ ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. మన దేశంలో ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ ఈ ఆలోచన చేయలేదు. మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆలోచన వారికి రాలేదు. కానీ, తొలిసారి జగన్ కు మాత్రం మహిళా కమాండోలతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీవీరి విధులు
+ బహిరంగ సభల్లో సీఎంకు రక్షణ
+ సమీపంలోని మహిళలపై నిరంతర నిఘా
+ ఎవరైనా దాడికి యత్నిస్తే.. రెప్పపాటు కాలంలో అడ్డుకోవడం
+ కరాటే కుంగ్ఫూలలోనూ శిక్షణ
+ వీరికి లాఠీలతోనూ పనిలేదు.. చేతులతోనే చుక్కలు చూపిస్తారట.