పథకాలు ఇస్తే జనం ఆల్ హ్యాపీస్ అని భ్రమల్లో బతుకుతున్న ఏపీ పాలక వర్గానికి ఈ వీడియో కళ్లు తెరిపిస్తుందేమో.
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు సంవత్సరాలుగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోయారు.
మద్దతు ధర విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, విత్తనాలు ఎరువుల సరఫరాలో ఆలస్యం… కరోనా, కరెంటు కోతలు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
వీటికి తోడు పొలానికి జగనన్న విద్యుత్ మీటర్లు కూడా పెట్టేశారు. రైతు ఆగమైపోతుంటే చేయి అందించాల్సిన సమయంలో నిబంధనలు మొదలుపెట్టారు.
ఏటా పంట కోల్పోతున్నా ఉత్తరాంధ్రకు, రాయలసీమకు నీటిని అందించడంలో కేసీఆర్ చేతిలో ఓడిపోయి రైతులను నడిరోడ్డున పడేశారు జగన్.
కేసీఆర్ తో గొడవపడుతున్నట్టే నటించి కేసీఆర్ అనుంగుడు అయిన మైహోం రామేశ్వరరావుకు టీటీడీ పదవి ఇవ్వడంతోనే కేసీఆర్ జగన్ చీకటి బంధం ఎంత స్ట్రాంగో సామాన్యులకు కూడా అర్థమైపోయింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలపై టీడీపీ చేస్తున్న పోరాటాలకు విపరీతమైన స్పందన కనిపిస్తోంది.
ముఖ్యంగా వైసీపీలో నెంబరు 2 గా ఫీలయ్యే మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో రైతుల ధర్నాకు అనూహ్య స్పందన వచ్చింది. ఇది చూస్తే మరి జగన్ కి నిద్ర పడుతుందో లేదో.
https://twitter.com/SreenivasC14/status/1438406100332650498