కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. దర్శకుడుగా, హీరోగా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. మరీ ముఖ్యంగా 1990వ దశకంలో ఉపేంద్ర ఇండియన్ సినిమా రంగంలో చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. విభిన్నమైన కథ. విభిన్నమైన హీరోటిక్ క్యారెక్టర్.. ఎవ్వరూ ఊహించని హీరోయిజం ఇలా రకరకాల చిత్ర విచిత్ర పాత్రలు, తనదైన టేకింగ్‌తో ఉపేంద్ర కొత్త సినిమాను సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు చూపించారు.
1990లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఓ వర్గం ప్రేక్షకులు అతృతుగా ఎదురు చూసేవారు. ఆ రోజుల్లోనే తెలుగులో ఉపేంద్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలిపించే వాతావరణం ఉండేది. ‘గాడ్ ఈజ్ గ్రేట్, ఐయమ్ ది గాడ్’ అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగు ఇప్పటికీ రీల్స్‌లో హల్ చల్ చేస్తోంది.
కొద్ది రోజులుగా దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చిన ఉపేంద్ర హీరోగా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. గతేడాది ఆర్. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా సినిమా అంచనాలు అందుకోలేదు. చాలా ఏళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉపేంద్ర ఇటీవల మరోసారి మెగాఫోన్ పట్టాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ సినిమా చేస్తున్నాడు. ఈ డిసెంబరు 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు.. కాన్సెఫ్ట్ చూస్తుంటే ఓ రేంజ్లో ఉంది. ఉపేంద్ర ఏ – రా – సూపర్ సినిమాల తర్వాత ఓ రేంజ్లో యూఐ ఉంటుందంటున్నారు. మరి ఉపేంద్ర విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో ? చూడాలి.