అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల వార్త బయటికి వచ్చిన మూణ్నాలుగు నెలలవుతోంది. కానీ ఇన్ని రోజుల్లో నాగచైతన్య ఎక్కడా ఆ విషయం గురించి నోరు విప్పింది లేదు. మధ్యలో తన సినిమా ‘లవ్ స్టోరి’ రిలీజ్ ప్రమోషన్లకు వచ్చాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎక్కడా ఆ ప్రస్తావన రాకుండా చూసుకున్నాడు.
ఇక సోషల్ మీడియా ద్వారా కానీ, ఇంకో రకంగా కానీ దీని గురించి చైతూ స్పందించింది లేదు. కానీ సమంత మాత్రం ఈ వార్త బయటికి రావడానికి ముందు నుంచి పరోక్షంగా దీనిపై స్పందిస్తోంది. తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టేస్తోంది. తిరుమలలో విడాకుల వార్త గురించి విలేకరి అడిగితే బుద్ధుంతా అని తిట్టడం మొదలుపెడితే.. ఈ వార్తను అధికారికంగా ప్రకటించడానికి ముందు, తర్వాత సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ కోట్స్ ద్వారా తన బాధను, అసహనాన్ని వెళ్లగక్కుతూనే వచ్చింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ విడాకులు తననెంత కుంగదీశాయో కూడా వివరించింది.
మొత్తానికి ఈ పరిణామాలన్నీ చూశాక చైతూనే సమంతను దూరం పెట్టాడేమో, తప్పు సమంత వైపే ఉందేమో, విడాకులు చైతూ కంటే సమంతనే ఎక్కువ బాధ పెట్టాయేమో, చైతూతో పోలిస్తే సమంత ఎమోషనల్‌గా వీక్ ఏమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
ఇంకొన్ని రోజులు పోయాక చైతూ మీద సమంత విమర్శలు, ఆరోపణలేమైనా చేస్తుందా.. మీడియా ముందు మరింత ఓపెన్ అయి బరస్ట్ అవుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వైవాహిక బంధం నుంచి విడిపోయిన కొన్ని రోజులకే ఆమె ఐటెం గర్ల్‌గా మారడం, కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ‘పుష్ప’ కోసం ఐటెం సాంగ్ చేయడం, అందులో వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అంటూ సాగిన పాట ఆమె వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నట్లుండి సమంత ఇంత హాట్‌గా కనిపించడంలో ఆంతర్యం.. విడాకుల తర్వాత తనకు స్వేచ్ఛ లభించిందని చెప్పడమే అని కొందరంటుంటే.. ఇంకోవైపేమో సమంత ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌లో ఇలా హద్దులు దాటి నటించడం వల్లే చైతూతో ఆమెకు విభేదాలు తలెత్తాయని అప్పట్లో వ్యాఖ్యానాలు చేసిన వాళ్లు ఇప్పుడు ఇంకా రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.
విడాకుల విషయంలో తన బాధను, అసహనాన్ని తరచుగా వ్యక్తం చేస్తున్న సమంత.. ఆ ఫ్రస్టేషన్లోనే ‘పుష్ప’ ఐటెం సాంగ్ చేసిందని.. ఈ పాట లిరిక్స్ అలా ఉండటంలో ఆంతర్యం కూడా అదే అని విశ్లేషిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనప్పటికీ ఈ పాటతో ఆమెకు వ్యక్తిగతంగా డ్యామేజ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.