• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఫ్లాష్ బ్యాక్‌.. ప్ర‌భాస్‌-ర‌కుల్ కాంబోలో సూప‌ర్ హిట్ ఎలా మిస్ అయింది..?

admin by admin
July 30, 2024
in Movies, Trending
0
0
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. తెలుగు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ తోనే రకుల్ ఇతర భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు తెగ కష్టపడుతోంది. అయితే టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్.. ఒక్క ప్ర‌భాస్‌ తో మాత్రం సినిమా చేయలేకపోయింది.

కానీ గతంలో మాత్రం ప్రభాస్, రకుల్ కాంబోలో ఒక సూపర్ హిట్ మూవీ మిస్ అయింద‌ట‌. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. ఇంతకీ ప్రభాస్ తో రకుల్ మిస్ చేసుకున్న సినిమా మ‌రేదో కాదు `మిస్టర్ పర్ఫెక్ట్`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు దశరధ్‌ దర్శకుడిగా వ్యవహరించారు. మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్.. సెకండ్ హీరోయిన్ గా తాప్సీ నటించారు. 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం సానుకూల స్పందనతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజికల్ గా కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను దిల్ రాజు రివీల్‌ చేశారు. మలేషియాలో బిల్లా షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఆ టైమ్ లో దిల్ రాజు, దశరధ్‌ వెళ్లి కథ చెప్పారు. సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవడంతో ప్రభాస్ నో చెప్పాలని అనుకున్నాడు. దాంతో దశరథ్ పలు మార్పులు చేసి మళ్లీ స్టోరీని నరేట్ చేయగా.. ఈసారి ప్రభాస్ కు బాగా నచ్చింది.

హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారు. హైదరాబాద్ లో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఐదు రోజుల తర్వాత రష్ చూసి ఎవ్వ‌రూ సంతృప్తి చెంద‌లేక‌పోయారు. సినిమా స్టోరీ మొత్తం హీరోయిన్ మీదే డిపెండ్ అయి ఉంది. ఎమోష‌న్స్ బాగా పండివ్వాలి. కానీ ర‌కుల్ ఆ విష‌యంలో విఫ‌లం అయింది. పైగా స‌న్నగా ఉండ‌టం వ‌ల్ల క్యారెక్ట‌ర్ కు ర‌కుల్‌ అస్స‌లు సెట్ అవ్వ‌లేద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారు. ఈ క్ర‌మంలోనే ఐదు రోజులు షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత ర‌కుల్ ను త‌ప్పించారు. ఆమె స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ప్ర‌భాస్‌, కాజ‌ల్ జోడి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా అలరించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Tags: Kajal AggarwalLatest newsMovie NewsMr. PerfectPrabhasrakulRakul Preet SinghTelugu NewsTollywood
Previous Post

మదనపల్లె ఫైళ్ల దగ్దం ..వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Next Post

ప‌బ్జి గేమ్ ఆడుతున్న ప్ర‌భుత్వ ఉద్యోగి.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే!

Related Posts

Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Movies

ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!

May 20, 2025
Load More
Next Post

ప‌బ్జి గేమ్ ఆడుతున్న ప్ర‌భుత్వ ఉద్యోగి.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే!

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra