ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యూహం ఒకటే… తాను ఏ తప్పు అయితే చేస్తున్నారో ఆ తప్పుపై జనం దృష్టి మరలకుండా చేయడానికి ఇతరులపై అలాంటి నింద వేస్తుంటాడు. సాక్షి ఎలాంటి వార్తలు రాస్తుందో, ఆ పత్రిక నిత్యం ఏం రాస్తుందో అందరికీ తెలుసు. అలాంటి పత్రిక నడిపే జగన్ ఇతరులకు మీడియా నీతులు చెబుతుంటాడు.
ఆయన గురించి ఆయన పాలన గురించి ఏపీ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాదు రియల్టర్లే చెబుతారు, జగన్ కనుక ఏపీ సీఎం కాకపోయిుంటే మేము రోడ్డున పడేవాళ్లం అని. అదీ జగన్ పాలనపై ఒరిజినల్ ఫీడ్ బ్యాక్.
తన విఫల పాలనను అందరికీ వివరిస్తున్నరాధాకృష్ణను పవర్ తో అణచివేయడానికి ప్రయత్నించి విఫలమై, కోర్టులతో అణచివేయడానికి ప్రయత్నించి విఫలమై… ఇక మొన్ననే ప్రజల మైండ్ ను ట్యూన్ చేస్తూ ఆర్కే పై ఒక పెద్ద బండ వేసి హనీమూన్ ట్రిప్ కి వెళ్లాడు. అదేలెండి మ్యారేజ్ డే ట్రిప్.
జగన్ చెప్పిందే కాసేపు నిజం అనుకుని…. ఆర్కే జగన్ కి కొన్ని ప్రశ్నలు వేశాడు. కానీ వాటికి జగన్ వద్ద ఆన్సరుందా? అని అడుగుతున్నాడు. మరి ఆర్కే ప్రశ్నలేంటి? చూద్దాం.
- ‘ఆంధ్రజ్యోతి’ గానీ మరొక మీడియా సంస్థ గానీ తప్పుడు రాతలు రాస్తే కేసు పెట్టడానికి ప్రత్యేకంగా జీవో జారీ చేయించిన జగన్రెడ్డి ఇప్పటివరకు నిర్దుష్ట ఆధారాలతో ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు ఎందుకో?
- చెవిలో జోరీగలాగా మారిన సొంత పార్టీ ఎంపీ RRRపై కక్ష తీర్చుకోవడం కోసం రాజద్రోహం కేసు పెట్టి, పనిలో పనిగా రెండు టీవీ చానళ్లను కూడా నిందితులుగా చేర్పించి సుప్రీంకోర్టుతో తిట్లుతిన్నది నిజం కాదా?
- జగన్ సర్కారుపై రోజుకు సగటున 450 కేసులు నమోదవడానికి ( పీటీఐ వార్తాసంస్థ వెలుగులోకి తెచ్చింది) దాఖలు కావడానికి కారణం ఏమిటో జగన్రెడ్డి చెప్పగలరా?
- అధికారులు తరచుగా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవడానికి కారణం జగన్రెడ్డి అసంబద్ధ నిర్ణయాలు కాదా?
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్రెడ్డి సొంత మీడియా ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసిందో, ఎలా అవాస్తవ కథనాలను ప్రచురించి ప్రసారం చేసిందో మరచిపోయారా?
- చంద్రబాబు ప్రభుత్వం 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అప్పట్లో సాక్షిలో రాసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా రుజువు చేయలేకపోయారెందుకు?
- నారాసుర రక్తచరిత్ర అని రాసి, వివేకాను చంపాడని ప్రచారం చేసిన జగన్ చంద్రబాబుపై కేసు పెట్టి లోపలెయ్యలేదు ఎందుకు?
- విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి వెనుక చంద్రబాబు ఉన్నాడని చెప్పిన జగన్ ఎందుకు ఆయనపై కేసు పెట్టలేదు.
- ఆంధ్రప్రదేశ్ పౌరుల డేటాను లోకేష్ సన్నిహితుడి కంపెనీ దొంగతనం చేసిందని అప్పట్లో మీరు రాసిన రాతలు అబద్ధం అని తీర్పు వచ్చింది నిజం కాదా?
- మీడియాను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడేందుకు ఇతరులపై అబద్ధాలు రాసింది, రాస్తున్నది మీరు కాదా?
- రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం ఎవరు?
- మరో నాలుగు నెలల పాటు కొత్త అప్పులు చేయడానికి వీలు లేదని కేంద్రప్రభుత్వం ఆదేశించడానికి కారణం మీ తప్పా? లేక మీడియానా?
- రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలుస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి మీడియా కారణమా?
- అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి … రివర్సులో మీరే పెంచిన విషయం నిజం కాదా?
- ‘ఆంధ్రా వెళుతున్నావా? అక్కడ మందు కొట్టొద్దు, ఏవో చెత్త బ్రాండ్లు అమ్ముతున్నారంట’ అని తమిళనాడు మంత్రి ఒకరు తన మిత్రుడికి సలహా ఇవ్వడం నిజం కాదా?
మరి ఈ ప్రశ్నలన్నిటికి జగన్ ఎపుడు సమాధానం చెబుతారు. అసలు ఆయన సొంత పార్టీ నేతలకే ఏమి అడిగే అవకాశం ఇవ్వరు. అడిగినా చెప్పారు. మరి రాధాకృష్ణ అడిగితే మాత్రం ఎందుకు చెబతారు. అయినా చెప్పడానికి ఏముందని చెబుతారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఆల్రెడీ ప్రజలకే సమాధానం తెలుసు.