ఆ లాయర్ దంపతుల హత్య వెనుక రాజకీయ కుట్ర?

తెలంగాణలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యోదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన చర్చనీయాంశమైంది. కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న దంపతులిద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు పాశవికంగా నరికి హత్య చేసి పరారయ్యారు. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి నరికిచంపిన వైనం గగుర్పాటుకు గురిచేస్తోంది. వామన్ రావుది పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం గుంజపడుగు స్వగ్రామం. స్వగ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది.


అయితే, ఈ హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుంట శ్రీను తనపై దాడి చేశాడంటూ తన కారు డ్రైవర్ తో వామనరావు చనిపోయేముందు చెప్పినట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఎవరైనా వదిలేది లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.

అయితే, ఈ కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తమకు ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది దంపతులు వెల్లడించినట్టు తెలుస్తోంది. జిల్లాలో శీలం రంగయ్య లాకప్‌ డెత్‌పై హైకోర్టులో వామన రావు, నాగమణి పిటిషన్‌ వేశారు. కానీ, ఈ కేసు వాపస్ తీసుకోవాలని వారికి బెదిరింపుల వచ్చాయని తెలుస్తోంది. ఈ కేసు విషయంలోనే రామగుండం సీపీ సత్యనారాయణతో వామనరావు, నాగమణి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకి వ్యతిరేకంగా వామనరావు పలు కేసులు వాదిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.