రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్…వైసీపీ నేతల వెన్నుదన్ను చూసుకొని సోషల్ మీడియాలో నోటికొచ్చిన బూతులతో ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడే వైసీపీ కార్యకర్త. టీడీపీ, జనసేన నేతలపై బూతులతో పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయడం అనిల్ పని అంటే అతిశయోక్తి కాదు. తాజా ఇదే అభిప్రాయాన్ని ఏపీ హైకోర్టు కూడా వ్యక్తపరిచింది. అనిల్ బెయిల్ పిటిషన్ రద్దు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అనిల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన అనంతరం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నిందితుడు అనిల్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? ఇటువంటి వారిని క్షమించడానికి వీల్లేదు…అతడికి బెయిల్ మంజూరు చేయడం లేదు’’ అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు, గుంటూరులోని ఓ చర్చి కోశాధికారి కర్లపూడి బాబు ప్రకాష్ ను రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అనిల్ పై మరో కేసు నమోదైంది. ఆ కేసులో కూడా అనిల్ బెయిల్ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది.