వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, దువ్వాడ వ్యవహారంపై ఆయన భార్య వాణి, పిల్లలు వీధి కెక్కారు. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం దువ్వాడతో కలిసి ఉండేందుకు వాణి అంగీకరించినా…దువ్వాడ మాత్రం వాణితో కలిసి ఉండేందుకు అంగీకరించడం లేదు. తన పరువు బజారున పడేసిన వాణితో కలిసి ఉండేదే లేదని దువ్వాడ అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడ ఇంటి బాల్కనీలో మాధురి కనిపించడంతో మళ్లీ ఈ వ్యవహారంపై రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే దువ్వాడపై వాణి, ఇద్దరు కుమార్తెలు ఫైర్ అవుతున్నారు.
మాధురి పేరిట దువ్వాడ ఓ ఇల్లు నిర్మిస్తున్నారని, ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని తెలుస్తోంది. వాణి, ఆమె ఇద్దరు కుమార్తెలు ఈ ఇంటి ముందే చాలాకాలంగా నిరసన చేస్తున్నారు. ఆ ఇంటికి మాధురి రావడంతో వాణి, పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వాణి, ఆమె కుమార్తెలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు అనుమతితో తాము ఆ ఇంట్లోకి వెళుతున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాణి వాదించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వాణి, ఆమె కుమార్తెలను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ కొత్త ఇల్లే తన క్యాంప్ ఆఫీసు అని దువ్వాడ చెబుతున్నట్లు తెలుస్తోంది.