టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. `ప్రతినిధి 2` సినిమాలో తనకు జోడిగా నటించిన శిరీష అలియాస్ సిరి లెల్లాతో నారా రోహిత్ ఏడడుగులు వేయబోతున్నాడు. ఆదివారం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నారా రోహిత్, సిరి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొట్టాయి.
అయితే నారా రోహిత్ కాబోయే భార్య సిరి లెల్లా ఎవరు..? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి..? వంటి విషయాలు తెలుసుకునేందుకు చాలా మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా వారింటికి కోడలిగా వెళ్లబోతున్న సిరి గురించి కొన్ని సంగతలు ఇప్పుడు తెలుసుకుందాం. సిరి మన తెలుగు అమ్మాయే. ఆమె అసలు పేరు శిరీష. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని దైద సిరి స్వస్థలం. కొన్ని కారణాలవల్ల ఆ ఊరిని వదిలి సిరి ఫ్యామిలీ రెంటచింతలకి వలసొచ్చారు.
సిరి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా.. తల్లి గృహిణి. సిరికి ముగ్గురు అక్కలు ఉన్నారు. పెద్ద అక్క శ్రీలక్ష్మీ రెంటచింతలలో అంగన్వాడీ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. రెండో అక్కడ భవానీ పెళ్లి చేసుకుని ఆమెరికాలో.. మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సిరి విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో ఆమె మాస్టర్స్ కంప్లీట్ చేసింది. గ్లామర్ ప్రపంచంపై విపరీతమైన మక్కువ ఉండంతో ఉద్యోగం చేయడానికి సిరి ఆసక్తి చూపలేదు.
ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చి హైదరాబాద్ లో తన అక్క వద్ద ఉంటూ సినిమాల్లో ఛాన్సులు కోసం ప్రయత్నించ సాగింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సిరి.. అనేక తిరస్కరణల అనంతరం ప్రతినిధి 2లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన నారా రోహిత్ నే ఇప్పుడు సిరి తన జీవిత భాగస్వామిగా చేసుకుంటోంది. నారా రోహిత్, సిరిలది ప్రేమ వివాహంగా తెలుస్తోంది.