టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. గబ్బర్ సింగ్ మూవీతో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న హరీష్ శంకర్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్.. తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. పిల్లలను ఎందుకు వద్దనుకున్నానో కూడా ఆయన వివరించారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తమది మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో పెద్దవాడిని కావడంతో చెల్లికి పెళ్లి చేయడం, తమ్ముడిని సెటిల్ చేయడం, అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించే బాధ్యతలను నేనే తీసుకున్నాను. అందుకు నా భార్య స్నిగ్ధ కూడా ఎంతగానో సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఇటువంటి బాధ్యతలు మళ్లీ వద్దనిపించింది. బాధ్యతల వల్ల వెనక్కి తగ్గకుండా మిగతా జీవితాన్ని గడపాలనుకున్నాను. అందుకే పిల్లలను వద్దని నేను, నా భార్య కూర్చుని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
ఒక్కసారి పిల్లలు పుడితే.. ప్రతి క్షణం వారి గురించే ఆలోచిస్తామని, మనలో స్వార్ధం పెరిగిపోతుందని హరీష్ శంకర్ అన్నారు. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన కూడా తెచ్చారు. మోదీ 3 సార్లు విజయం సాధించడానికి ఆయనకు పిల్లలు లేకపోవడం కూడా ఒక కారణమే. పిల్లలు లేకుంటే ఒక వ్యక్తి నిస్వార్థంగా, బాదరబందీలకు లోనుకాకుండా పని చేయగలడు. మోడీ అందుకు ఒక ఉదాహరణ. సేమ్ టు సేమ్ నేను కూడా నిస్వార్థంగా ఉండాలని అనుకుంటున్నాను.. బంధాల బంధనాల్లో జీవితాన్ని ముడిపెట్టకుండా ఉండాలని భావిస్తున్నాను అంటూ డైరెక్షన్ హరీష్ శంకర్ తెలిపారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది హరీష్ శంకర్ `మిస్టర్ బచ్చన్`తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం హరీష్ శంకర్ చేతిలో `ఉస్తాద్ భగత్ సింగ్` ఉంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి చాలా కాలమే అయినా పవన్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది.