ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికామాటలాడి
అని ఒక పద్యం ఉంది.
పరిస్థితులకు తగ్గట్టు మనిషి మెసలు కోవాలి.
ఒకపుడు ఫైర్ బ్రాండ్లు అయిన జేసీ ఫ్యామిలీ రాజకీయంగా జగన్ వచ్చాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కేసులతో జైలులో ఉండాల్సి వచ్చింది.
జగన్ తత్వాన్ని, సర్కారు తీరును అర్థం చేసుకున్న జేసీ తమకు అలవాటైన పద్ధతిలో కాకుండా కేవలం అభివృద్ధి కోణంలో మాత్రమే ప్రజల్లోకి వెళ్లి మున్సిపాలిటిని సొంతం చేసుకున్నారు.
తెలుగుదేశం కేడర్ సత్తాను సరిగా అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రజల మనసు గెలిచారు ప్రభాకర్ రెడ్డి.
కోవిడ్ టైంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి, పాలనకు దగ్గరగా, రాజకీయాలకు దూరంగా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఖాళీ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇటీవల ఆయన యవతకు ఇచ్చిన సందేశం ఎంతో వైరల్ అయ్యింది.
ఈరోజు జేసీ పుట్టిన రోజు. తాడిపత్రి మొత్తం హోరెత్తిపోతోంది. జేసీకి హ్యాపీ బర్త్ డే అంటే నెటిజన్లు మోతెక్కిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పరువును పతాకమెత్తు నిలబెట్టిన జేసీకి తెలుగుదేశం నేతలు కూడూా నీరాజనాలు పడుతున్నారు.
ఇపుడు కాస్త నెమ్మదిగా ఉన్నా ఎన్నికల నాటికి తమ సత్తా ఏంటో అందరూ చూస్తారంటోంది జేసీ ఫ్యామిలీ.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే,మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.@JCPavanReddy1 @ashmitjc @ashmitjcTDP pic.twitter.com/cUX6CBMKs3
— Yanamadala Sai Pavan (@YanamadalaSai1) May 25, 2021