గుండమ్మ కథ సినిమా విశేషాలు…
1)రిలీజ్ తేదీ — 07-06-1962
2)Black and white,35 MM
3)నిడివి –14999 అడుగులు
4)సెన్సార్ సర్టిఫికేట్ నంబర్ –34057
5)రీళ్లు –18
6)సెన్సార్ తేదీ –30-05-1962
7)కన్నడంలో బి.విఠలాచార్య నిర్మంచిన ‘మనె తుంబిద హెణ్ణు ‘ఈ సినిమా కథకు మూలం. ఈ కథను కొద్దిగా మార్చి గుండమ్మకథ ను చక్రపాణి రూపొందించారు.
8)ఈ సినిమా నిర్మాణం సంవత్సరం పాటు కొనసాగింది. ఈ సినిమాకు తొలుత బి.ఎన్.రెడ్డి,పోలుదాసు పుల్లయ్య లను దర్శకులుగా అనుకున్నా,చివరకి కమలాకర కామేశ్వరరావును దర్శకుడుగా ఎంపిక చేశారు.
9)విడుదలకు 10 రోజుల ముందు,ఎల్.వి.ప్రసాద్ కుమార్తె వివాహ సందర్భంగా విజయా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నాట్య ప్రదర్శన సమయానికి వైజయంతిమాల రాలేక పోవటంతో గుండమ్మకథ సినిమాను అతిథులుకు చూపించారు.ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి తో సహా పలువురు ఈ సినిమా ఆదడని అభిప్రాయపడ్డారు. కాని నిర్మాతలు మాత్రం సినిమాపై గట్టి నమ్మకం తో ఉన్నారు.
సినిమా విడుదల అయిన తర్వాత ప్రముఖుల అంచనాలను తలకిందులు చేస్తూ విజయవిహారం చేసింది.
10)ఈ సినిమా టైటిల్స్ లో నటీ నటులపేర్లు వేయకుండా అందరి ఫోటోలు వేశారు.
11)ఎన్టీఆర్,అక్కినేని కలిసి నటించిన 14 సినిమాలలో ఇది10 వది
12)ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన సినిమాలు(14)…. (1)పల్లెటూరి పిల్ల(1950)(2)సంసారం(1950)(3)రేచుక్క (1954)(4)పరివర్తన(1954)(5)మిస్సమ్మ(1955)(6) తెనాలి రామకృష్ణ(1956)(7)చరణదాసి(1956)(8) మాయా బజార్(1957)(9)భూకైలాస్(1958)(10) గుండమ్మకథ(1962)(11)శ్రీకృష్ణార్జునయుధ్ధం(1963)(12) చాణక్యచంద్రగుప్త(1977)(13)రామకృష్ణులు(1978)(14) సత్యం శివం(1981)
13)ఈ సినిమా ఎన్టీఆర్ కు 100 వ సినిమా,అక్కినేనికి 99 వ సినిమా*
14)తమిళ వెర్షన్’ మనిదన్ మారవిల్లే ‘ లో ఎన్టీఆర్ పాత్ర జెమినీ గణేషన్ పోషించారు. ఈ సినిమా అక్కినేనికి100 వ సినిమా.ఈ సినిమాకు చక్రపాణి దర్శకత్వం వహించారు .సినిమా ఆశించిన విజయం సాధించ లేదు.
15)మొదటి రన్ లో 25 కేంద్రాలలో విడుదల అయ్యింది.
16)మొదటి రన్ లో 19 కేంద్రాలలో 100 రోజులు ఆడింది లేట్ రన్ లో నరసరావు పేట–నాగూర్ వలి,చిలకలూరి పేట –విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్ లో 100 రోజులు ఆడింది.మొత్తం 21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.14-04-1963 న చిలకలూరిపేట–విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్ లో 100 రోజుల వేడుక జరిగింది.
17)హైదరాబాద్– ప్రభాత్ లో105 రోజులు ఆడింది.తర్వాత షిఫ్ట్ తో ఆడింది.
18)హైదరాబాద్ లో 3 ఆటలుతో 100 రోజులు ఆడిన మొదటి సినిమా(ఈ సినిమా ముందు వరకు 2 ఆటలు మాత్రమే వేసేవారు).
19)విజయవాడ — దుర్గకళామందిరం లో 175 రోజులు ఆడింది.
20)175 రోజుల వేడుక జరపకుండా ఆ మొత్తాన్ని చైనా తో యుధ్ధం చేస్తున్న భారత సైన్యం యుద్ధ నిధికి నిర్మాత నాగిరెడ్డి విరాళమిచ్చారు.
21)100 రోజుల కేంద్రాలు….(1) విజయవాడ — దుర్గ కళామందిరం(175 రోజులు)(2) హైదరబాద్– ప్రభాత్ (105 రోజులు)(3) గుంటూరు — నాజ్ (4)రాజమండ్రి — అశోక(5)కాకినాడ — క్రౌన్(6)విశాఖపట్నం — లక్ష్మీ(7) నెల్లూరు — రంగమహాల్(8)విజయనగరం — శ్రీరామా(9) ఏలూరు — వెంకట్రామా(10)మచిలీపట్నం — బృందావన్ (11)భీమవరం — సత్యనారాయణ(12)గుడివాడ — శరత్ (13)ఒంగోలు — సీతారామ(14)తిరుపతి — జ్యోతి(15) కర్నూల్ — చాంద్(16)సికింద్రాబాద్ — అలంకార్ (17) తెనాలి — స్వరాజ్(18)వరంగల్– రామా (19)నిజామాబాద్ – మోహన్(20) నరసరావుపేట– నాగర్ వలి(21)చిలకలూరిపేట – విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్
22)అనకాపల్లి — పరమేశ్వరీ పిక్చర్ ప్యాలస్ లో 7 వారాలు ఆడింది.
23)02-08-1962 న మద్రాస్ — కాసినో లో విడుదల అయ్యింది.
24)1962 లో 24 సినిమాలు విడుదల కాగా, ఎన్టీఆర్ నటించినసినిమాలు10.అవి…రక్తసంబంధం(12కేంద్రాలు), గుండమ్మ కథ(21 కేంద్రాలు),ఆత్మ బంధువు(2 కేంద్రాలు), మహామంత్రి తిమ్మరుసు(5 కేంద్రాలు),భీష్మ(2 కేంద్రాలు), దక్ష యజ్ఞం,గులే బకావలి కథ(4 కేంద్రాలు), గాలిమేడలు, టైగర్ రాముడు, స్వర్ణ మంజరి.
25)ఎన్టీఆర్ తో జతగా సావిత్రి నటించగా,అక్కినేని తో జతగా జమున,హరనాథ్ తో జతగా ఎల్.విజయలక్ష్మి నటించారు.
26)ఈ సినిమాలోని అన్ని(8) పాటలు హిట్ సాంగ్స్ గా మన్ననలు పొందాయి.
గుండమ్మ కథ సినిమా సాంకేతిక నిపుణులు…
1)ప్రొడక్షన్ — విజయా ప్రొడక్షన్ లిమిటెడ్
2)నిర్మాతలు — బొమ్మిరెడ్డి నాగిరెడ్డి(బి.నాగిరెడ్డి),ఆలూరి వెంకట సుబ్బారావు(చక్రపాణి)
3)దర్శకుడు — కమలాకర కామేశ్వరరావు
4)సంగీతం — ఘంటసాల వెంకటేశ్వరరావు,సహాయకులు — ఏ.కృష్ణమూర్తి,రాఘవులు
5)మాటలు — డి.వి.నరసరాజు
6)కథ — ఆలూరి వెంకట సుబ్బారావు(చక్రపాణి)
7)పాటలు — పింగళి నాగేంద్రరావు
8)ఛాయా గ్రహణం– మార్కస్ బార్ట్లే
9)కళ — గోఖలే,కళాధర్
10)నృత్యం — పసుమర్తి కృష్ణమూర్తి
11)ఎడిటింగ్ — జి.కళ్యాణ సుందరం,డి.జి.జయరాం
12)గాయనీ గాయకులు — ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల,పి.లీల
13)డైరక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ — ఏ.కృష్ణన్
14)సౌండ్ ఇంజనీర్ —వి.శివరాం
15)పెయింటింగ్స్ — ఆర్.జయరామరెడ్డి
16)ప్రాసెసింగ్ — ఎన్.సి.సేన్ గుప్తా
17)మేకప్–ఎం.పీతాంబరం,టి.పి.భక్తవత్సలం,సహాయకుడు — పి.ఎన్.కృష్ణన్
18)నిర్మాణ సహాయకులు — డి.జగన్నాథ్,ఎం.ఎస్. చలపతిరావు
19)స్పెషల్ ఎఫెక్ట్స్ — హర్బాన్స్ సింగ్
20)చీఫ్ ఎలక్ట్రీషియన్ — ఎం.శంకరనారాయణన్
21)పబ్లిసిటి — కె.నాగేశ్వరరావు
22)సెట్టింగ్స్ — సి.కుప్పుస్వామినాయుడు,కె.శ్రీనివాసన్
23)మోల్డింగ్ — ఎం.గోపాలపిళ్ళె
24)స్టూడియోలు — విజయా,వాహినీ
25)సహయ దర్శకులు — సి.నాగేశ్వరరావు,కె.బాబూరావు
26)కెమెరాసహాయకులు–కె.ఎస్.రామకృష్ణారావు,పి.విజయసుందరం
27)లాబ్ సహాయకులు–టి.ఆర్.ఎతిరాజులు, పి.వెంకట్రామన్,ఆర్.సూర్యప్రకాశరావు
28)సౌండ్ సహాయకులు — ఎం.ఎన్.గోపి,పి.గోపాలకృష్ణన్
29)లాబ్ — విజయా లేబరేటరి,మద్రాస్
30)రిలీజ్ — విజయా రిలీజ్
గుండమ్మకథ సినిమాలో నటీ నటులు….
నందమూరి తారక రామారావు– అంజి, ఆంజనేయ ప్రసాద్(రామభద్రయ్య కొడుకు)
అక్కినేని నాగేశ్వరరావు — రాజా(రామభద్రయ్య కొడుకు)
కొమ్మారెడ్డి సావిత్రి– లక్ష్మి(గుండమ్మ సవతి కూతురు,అంజి భార్య)
జమున — సరోజ(గుండమ్మ కుతురు,రాజా భార్య)
సామర్ల వెంకట రంగారావు(ఎస్.వి.రంగారావు)– రామభద్రయ్య(అంజి,రాజాల తండ్రి)
పెద్దిభొట్ల సూర్యాకాంతం — గుండమ్మ(సరోజ తల్లి)
తిక్కవరపు వెంకటరమణారెడ్డి –కంచుగంటయ్య,గంటన్న (గుండమ్మ మారుటి అన్న)
రాజనాల కాళేశ్వరరావు — భూపతి(గంటయ్య కొడుకు)
ఛాయాదేవి — కనకదుర్గమ్మ(పద్మ మేనత్త)
హరనాథ్– ప్రభాకర్(గుండమ్మ కొడుకు)
ఎల్.విజయలక్ష్మి — పద్మ(ప్రభాకర్ భార్య)
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి– (పద్మ తండ్రి)
అల్లు రామలింగయ్య(అతిధి పాత్ర)– హోటల్ యజమాని
ఋష్యేంద్రమణి—(పద్మ తల్లి)
పి.హేమలత — (గంటయ్య భార్య)
బొడ్డపాటి కృష్ణారావు – పెళ్లిళ్ల పేరయ్య
వల్లూరి బాలకృష్ణ – హోటల్ సర్వర్
రాజు…
గుండమ్మకథ సినిమాలో పాటలు….
1)లేచింది,నిద్ర లేచింది మహిళా లోకం,దద్దరిల్లింది పురుష ప్రపంచం, ఎపుడో చెప్పెను వేమనగారూ— పింగళి నాగేంద్రరావు –ఘంటసాల వెంకటేశ్వరరావు (ఎన్టీఆర్)
2)మౌనముగా నీ మనసు పాడిన వేణు గానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీకనులనే కనుగొంటిలే— పింగళి నాగేంద్రరావు – ఘంటసాల వెంకటేశ్వరరావు (అక్కినేని)
3)సన్నగ వీచే చల్ల గాలికీ,కనులు మూసినా కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై – పింగళి నాగేంద్రరావు – పి.సుశీల(జమున)
4)కోలు కోలో యన్న కోలో నాసామి,కొమ్మలిద్దరు మంచి జోడూ,మేలు మేలో యన్న మేలో నారంగ — పింగళి నాగేంద్రరావు –ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.సుశీల (ఎన్టీఆర్,సావిత్రి,ఏ.ఎన్.ఆర్,జమున)
5)ఎంత హాయి ఈరేయి,ఎంత మధుర మీహాయి, చందమామ చల్లగా మత్తు మందు చల్లగా — పింగళి నాగేంద్రరావు –ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.సుశీల( అక్కినేని,జమున)
6)వేషమూ మార్చెనూ,భాషనూ మార్చెనూ, మోసము నేర్చెను,అసలు తానే మారెను – పింగళి నాగేంద్రరావు —ఘంటసాల వెంకటేశ్వరరావు,పి.లీల(ఎన్టీఆర్,సావిత్రి)
7)అలిగిన వేళనె చూడాలి,గోకుల కృష్ణుని అందాలూ, రుస రూస లాడే చూపులలోన– పింగళి నాగేంద్రరావు –పి.సుశీల(సావిత్రి)
8)ప్రేమ యాత్రలకు బృందావనమూ,నందనవనమూ ఏలనో,కులుకు లొలుకు చెలి చెంతనుండగా– పింగళి నాగేంద్రరావు –(అక్కినేని,జమున)
9)సన్నగ వీచే చల్ల గాలికీ,కనులు మూసినా కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై – పింగళి నాగేంద్రరావు – పి.సుశీల(జమున)