మరో రెండ్రోజుల్లో చంద్రబాబు అరెస్ట్ ఖాయం…అమరావతి కోసం రైతులిచ్చిన స్థలాలు, పొలాలు మొత్తం చంద్రబాబు, నారాయణలే కాజేశారట..నారాయణను అరెస్టు చేసిటనట్లే సైలెంట్ గా చంద్రబాబునూ లోపలేస్తారట…ఇటువంటి ప్రచారం గత రెండురోజులుగా ఏపీవ్యాప్తంగా జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ తరహా గోబెల్స్ ప్రచారంతో అదేదో ఆనందం టైపులో సంతోషపడుతున్నారు.
ఇక, వైసీపీ నేతలైతే…చంద్రబాబైనా…వేరె
చంద్రబాబు అరెస్ట్ పుకార్ల నేపథ్యంలో జగన్ కు గోరంట్ల వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో పాశవిక పాలన కొనసాగుతోందని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని, అందులో భాగంగానే చంద్రబాబు, నారాయణలపై కేసులు నమోదు చేశారని గోరంట్ల అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని చెప్పారు.
నవరత్నాలు అనేవి పెద్ద బోగస్ అని, అందుకే గడప గడపకు వెళ్లేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. తమ ఇంటి వద్దకు వస్తున్న వైసీపీ నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, జనంలోకి వైసీపీ నేతలు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. టీడీపీ పొత్తులను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.