టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఇరు తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కూడా యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్యా పాండేల కాంబినేషన్లో విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో రౌడీ హీరో బిజీబిజీగా గడుపుతున్నాడు.
యూత్ ను ఎక్కువగా టార్గెట్ చేసిన రౌడీ హీరో షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో ఈవెంట్లతో దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఎక్కడికి వెళ్ళినా యువతీ యువకులు భారీగా తరలిస్తున్నారు. ఇక, విజయ్ దేవరకొండకు ఇంత క్రేజ్ ఉందా అని బాలీవుడ్ మీడియా కూడా షాక్ అవుతోంది. ఇక, అమ్మాయిలకు అయితే ఈ రౌడీ హీరో కలల రాకుమారుడిగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ మీద చాలామంది అమ్మాయిలు విపరీతమైన క్రష్ పెంచుకున్నారు.
విజయ్ పెళ్లి చేసుకుంటే చంపేస్తామంటూ బెదిరించే రేంజ్ కు ఆ క్రష్ వెళ్ళిందంటే ఆ క్రేజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో లైగర్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండకు ఒక అమ్మాయి రింగ్ తొడిగింది. తన అభిమాన హీరోని చూసి ఆనందంతో పులకరించి పోయిన ఆ అమ్మాయి…విజయ్ కు దిష్టి తగలకుండా ఒక ఉంగరం తొడిగింది. తన రౌడీ హీరోపై తన ప్రేమను ఆ అమ్మాయి అలా వెల్లడించింది.
అయితే, ఆమె ప్రపోజ్ చేసిన తీరు విజయ్ కు కూడా నచ్చింది. దీంతో స్పందించిన విజయ్…ఆమెను హగ్ చేసకున్నాడు. అయితే, విజయ్ అలా రియాక్ట్ అవుతాడని ఎక్స్ పెక్ట్ చేయని ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. లైగర్ ప్రమోషన్లు పూర్తయే వరకు ఆ రింగ్ ఉంచుకుంటానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.