టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. తన ఇంటి ముందు మోహన్ బాబు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ వ్యవహారంలో జీహెఎంసీ చలాన్ జారీ చేసింది. మోహన్ బాబు ఇంటి ముందు ఎల్ఈడీ లైట్లతో ఉన్న భారీ హోర్డింగ్ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అందుకే, మోహన్ బాబుకు జరిమానా విధించామన్నారు.
ఇంటి బయట ముందస్తు అనుమతి లేకుండా హోర్డింగ్ ఏర్పాటు చేసినందుకు మోహన్ బాబుకు రూ.లక్ష రూపాయల జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది. ఈ ప్రకారం మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం చలాన్ జారీ చేసింది. ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా హోర్డింగ్ ను ఏర్పాటు చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్టు చలాన్ లో పేర్కొంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన అడ్వైర్టైజ్మెంట్ హోర్డింగ్….భవనం ఫ్రంటేజ్‌కు 15 శాతం మించిపోయిందని తెలిపింది.
ముందస్తు అనుమతి లేకుండా ఇటువంటివి ఏర్పాటు చేయడం సంబంధిత సెక్షన్ల ప్రకారం నేరమని, అందుకే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం రూ.లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు స్పందించలేదు.