రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించేంత సమయం కూడా ఇవ్వకుండా ప్లాన్ జరిగినట్టు అర్థమవుతోంది.
మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం GHMC elections 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మసబ్ ట్యాంక్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.
బుధవారం నుంచి అంటే రేపటి నుంచి నవంబరు ( ఈ నెల) 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
డిసెంబర్ 1న GHMC elections పోలింగ్ జరగనుంది. అసరమైన చోట్ల డిసెంబర్ 3న రీపోలింగ్ కి తేదీ ఫిక్స్ చేశారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తారు.
అతి తక్కువ సమయంతో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం వెనుక టీఆర్ఎస్ భయం కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో అభ్యర్థులను వెతుక్కునే అవకాశం కూడా ఆ పార్టీకి ఇవ్వకూడదు అని టీఆర్ఎస్ భావించి ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.