పోయేం కాలం కాకపోతే మరేంటి? అమెరికాలాంటి అగ్రరాజ్యంలో ఇష్టానుసారంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. మహాత్మాగాంధీ విగ్రహాం పట్ల కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అనాగరికంగా వ్యవహరించారు. విగ్రహాన్ని ముక్కలు చేశారు. ఈ ఉదంతంపై భారతీయ అమెరికన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. దావిద్ సిటీలోని సెంట్రల్ పార్కులో ఉన్న భారత జాతిపిత గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ముక్కలుగా విరిచి పడేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది భారత విదేశాంగ శాఖ. ఈ చర్యను తాము ఖండిస్తామని పేర్కొంది. గాంధీ విగ్రహం పట్ల అనాగరికంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక విచారణ అధికారుల్ని నియమించారు.
గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. ఈ ఘటనపై అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ఉదంతం జరిగిన తర్వాత కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఉదంతం గురించి సమాచారం తెలుసుకున్న భారతీయ అమెరికన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పోయే కాలం కాకపోతే.. గాంధీ లాంటి మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటమా?