• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సంక్రాంతి బరిలో మామకు బదులు మేనల్లుడు

admin by admin
January 1, 2022
in Movies, Trending
0
0
SHARES
713
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పలు సినిమాల విడుదలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా కోసం విడుదలను వాయిదా వేసుకున్న భీమ్లా నాయక్…సంక్రాంతికి రిపోర్ట్ చేయబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన విడుదల కాలేదు. ఇంకా, సీజీ, పెండింగ్ వర్క్ పూర్తికావడానికి 15 రోజులు పట్టే అవకాశముండడంతో భీమ్లా నాయక్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తోంది.

ఇక, ఆర్ఆర్ఆర్ కోసం విడుదల తేదీ మార్చుకున్న మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రం మాత్రం సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితేనేం, మామ స్థానంలో మేనల్లుడు సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా ఈ సంక్రాంతికి ‘హీరో’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గల్లా అశోక్ తెరంగేంట్రం చేస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ సందడి చేయనుంది.

వాస్తవానికి ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడటంతో ఒమిక్రాన్ నేపథ్యంలో ముందుగానే విడుదల చేయబోతున్నారట. “ఈ సంక్రాంతికి థియేటర్లలో దీపావళి టపాసుల్లాంటి వినోదానికి సిద్ధం అవ్వండి. జనవరి 15న గ్రాండ్‌గా ‘హీరో’ విడుదల అవుతుంది” అని అశోక్ గల్లా ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ‘హీరో’ సినిమాను నిర్మిస్తున్నారు.

శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా…జిబ్రాన్ సంగీతం అందించారు. మరి, నటనలో అశోక్ తాతకు తగ్గ మనవడిగా…మామకు తగ్గ మేనల్లుడిగా పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

Tags: debut movieGalla Ashok as HeroHero movie release datesankranthi racetdp mp galla jayadev
Previous Post

ఆ వయసు వారికి టీఎస్ ఆర్టీసీ లైఫ్ టైం ఫ్రీ ఆఫర్

Next Post

రాధాపై రెక్కీ…జగన్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్లు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Load More
Next Post

రాధాపై రెక్కీ...జగన్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్లు

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra