సుమారు 14 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ పురస్కారాల వేడుక ప్రారంభమైంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ గారి స్మృతిలో అవార్డులు అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేవలం నటీనటులకు మాత్రమే కాకుండా, రచయితలు, దర్శకులు, గాయకులు, కొరియోగ్రాఫర్లు, సాంకేతిక నిపుణులు మొదలైన వారికి ఈ గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు.
గురువారం ఉదయం గద్దర్ అవార్డు కమిటీ ఛైర్మెన్ జయసుధ అవార్డుల విజేతలను ప్రకటించారు. 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డును ప్రకటించారు. అలాగే ఉత్తమ తొలి చిత్రంగా `కల్కి` అవార్డు కైవశం చేసుకుంది. పూర్తి జాబితాను పరిశీలిస్తే..
– ఉత్తమ చిత్రం: కల్కి
– ఉత్తమ రెండో చిత్రం: పొట్టేల్
– ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్
– ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
– ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
– ఉత్తమ డైరెక్టర్: నాగ్ అశ్విన్ (కల్కి)
– ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
– ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్)
– ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
– ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
– ఉత్తమ స్టోరీ రైటర్: శివ పాలడుగు
– ఉత్తమ స్క్రీన్ ప్లే: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
– ఉత్తమ గాయకుడు: సిద్ద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)
– ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
– ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర)
– స్పెషల్ జ్యూరీ అవార్డు: దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)
– స్పెషల్ జ్యూరీ అవార్డు: అనన్య నాగళ్ల (పొట్టేల్)
– బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్: యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
– 2024 ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథకాదు
కాగా, 2025 జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరై సందడి చేయనున్నారు.