ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రవాసీ తెలుగు తమ్ముళ్ళు
అరబ్బు దేశాలన్నింటిలోనూ కీలకమైన రాజధాని నగరంగా భావించె సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో ప్రప్రధమంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మిని మహానాడు తెలుగు ప్రవాసీయులలో ప్రకంపనలు సృష్టిస్తుంది.
సోమవారం రాత్రి రియాధ్ లో తెలుగుదేశం పార్టీ ప్రముఖులు శేఖ్ జానీ బాషా మరియు చెన్నుపాటి రాజశేఖర్ల నాయకత్వంలో నిర్వహించిన మినీ మహానాడులో మహిళలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గోనడం జరిగింది.
రియాధ్ నగరంలో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఒక్క పార్టీ కూడ ఏ రకమైన కార్యక్రమాన్ని నిర్వహించలేదు, ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు తెలుగుదేశం యువ నాయకులు నిర్వహించిన మిని మహానాడుకు అటు చిత్తూరు జిల్లా నుండి ఇటు శ్రీకాకుళం జిల్లా చెందిన వారి వరకు ప్రవాసీయులు ఒక పండుగ తరహా వాతవారణంలో మహానాడును జరుపుకోన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా ముఖ్య అతిథిగా పాల్గోని ప్రపంచంలోని నలుమూలలలో ఉన్న తెలుగు వారిని చెరువ కావడానికి అధినాయకులు చంద్రబాబునాయడు మరియు లోకేశ్ లు చేస్తున్న ప్రయత్నాలను సభికులకు వివరించారు.
తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిను ప్రవాసీయులు ఏలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవడానికి ఎపి ఎన్నార్టీ సంస్ధ దర్శన విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు స్లాటుల సంఖ్య పెంచిందని రాధాకృష్ణా హర్షధ్వనాల మధ్య వెల్లడించారు.
ఎపి ఎన్నార్టీ సంస్ధ అధ్వర్యంలో దేశంలో కేరళతో సహా ఏ రాష్ట్రం కూడ చేయని విధంగా ప్రవాసీయుల సంక్షేమానికి ఎపి ఎన్నార్టీ సంస్ధ చెర్మెన్ డాక్టర్ వేమూరి రవి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా కూడ ఆయన వెల్లడించారు.
స్ధానిక చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి దేశంలోని వివిధ ఎడారి ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీను విస్తరించనున్నట్లుగా తెలుగుదేశం ఎన్నారై సౌదీ అరేబియా శాఖ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా పెర్కోన్నారు.
100 కోట్లతో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ చర్యలు చేపట్టాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ తో భీమా పథకాన్ని కూడ ప్రవేశపెట్టాలని రియాధ్ లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, మహానాడు నిర్వహకులైన జానీ బాషా మరియు రాజశేఖర్లు కోరారు.
రియాధ్ మరియు ఇతర గల్ఫ్ నగరాల నుండి విజయవాడ మరియు విశాఖపట్టణం నగరాలకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలని కూడ వారివురు కోరారు.
గల్ఫ్ దేశాలకు వచ్చె వారిలో వృత్తి నైపుణ్యం కోరకు స్కిల్ డెవలప్మెంట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
విజయవాడలో కనుకదర్గ గుడి, తిరుమల ఏడు కొండల వెంకటేశ్వరుడు ధార్మిక ఆరాధనపరంగా ఎంత ముఖ్యమో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూడ తెలుగు వారికి అంతె పవిత్రమైందని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.
సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాలలో భారతీయ మహిళలకు సహాయం చేసే కేంద్రాలలో తెలుగు భాషను తెలిసి కోఆర్డినేటర్లను నియమించాలని తెలుగు దేశం పార్టీ నాయకురాలు గడ్డం శిల్పా కోరారు.
ఇక్కడి నుండి ప్రత్యెక పరిస్ధితులలో జైళ్ళు మరియు డిపోర్టెషన్ సెంటర్ల ద్వార తిరిగి వెళ్ళె విధీ వించిత తెలుగు మహిళలకు హైద్రాబాద్ విమానశ్రాయంలో ప్రత్యెక సహాయ కేంద్రాన్ని ప్రారంభించె విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శిల్పా కోరారు.
అయిదెళ్ళ జగన్ ఆరాచక పాలనను మరో నాయకుడు వి. సారధి నాయుడు తీవ్రంగా దుయ్యబట్టారు.
సత్తిబాబు తెలుగుదేశం విజన్ వలన జరిగిన ప్రయోజనాలను వివరించారు.
మహిళ నాయకురాలు చేతన తన స్వాగతోపన్యాసంలో తెలుగుదేశం పార్టీ ప్రజా సేవ విధానాన్ని మరియు పార్టీలో ఉన్న మహానాడు ప్రత్యెకతను వివరించారు.
తెలుగు గడ్డపై ప్రప్రధమంగా ప్రవాసీయులను రాజకీయాలలో తీసుకోవచ్చి ప్రొత్సహించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని చేతన కీర్తించారు.



