అన్నొచ్చాడు.. వాన కాదు.. వరదొచ్చింది బాబోయ్!!

``జగనన్న వచ్చాడు.. వర్షాలు తెచ్చాడు!`` అని వైసీపీ నాయకులు గత ఏడాది ప్రచారం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, ఇప్పుడు మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. ``అన్నొచ్చాడు.. వరద తెచ్చాడు.. మమ్మల్ని ముంచాడు!`` అని దాదాపు ఆరు నుంచి ఏడు జిల్లాల అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సకాలంలో వర్షాలు రావడం వేరు..కానీ, ఇప్పుడు వచ్చిన వర్షాలతో మంచి ఉత్పత్తి దశలో ఉన్న అన్ని పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అదేసమయంలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులకు కోలుకోలేని విధంగా ఈ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వాన చినుకులు కురిసినా.. ఆ క్రెడిట్‌ను సీఎం జగన్ ఖాతాలోకి మళ్లించేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా.. కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. అదేసమయంలో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరదలుఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 23వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, 6,164 హెక్టార్లలో ఉద్యానపంటలు వరద బీభత్సానికి తుడిచి పెట్టుకుపోయాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఎన్నడూ చవిచూడని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పిల్ల పెరిగి పెద్దదవుతున్న దశకు చేప, రొయ్య చేరిన సమయంలో వరద ముంచెత్తడంతో ఉత్పత్తి కొట్టుకుపోయింది. జిల్లాలో సుమారు 52 వేల ఎకరాల్లో ఆక్వా సాగు తుడిచి పెట్టుకుపోయింది. గడిచిన ఆరు నెలలుగా రైతులు పడిన కష్టం వరదకు కొట్టుకుపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఇక, గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో సుమారు 1300 ఎకరాలలో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 420 ఎకరాల్లో ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. ఇలా దాదాపు ఆరు నుంచి ఏడు జిల్లాల్లో వరదలు, వర్షాలు బీభత్సం సృష్టించాయి.
అయితే, వర్షాలను తమ క్రెడిట్ లో వేసుకుని, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించే వైసీపీ నాయకులు.. ఈ సారి మాత్రం నోటికి తాళాలు వేసుకున్నారని, ఎక్కడ నోరు విప్పితే.. వ్యతిరేకత వస్తుందోనని వారు భయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, చిత్రం ఏంటంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నాయకులు కూడా పర్యటించలేదు. అదేమని అండిగితే.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు లేవని వెల్లడించడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓ నలుగురు మంత్రులు మాత్రం బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
అయితే బాధితులకు.. భరోసా ఇస్తున్నా.. ఇప్పటి వరకు ప్రజలకు అందించిన సాయం మాత్రం కనిపించడం లేదు. ఇదిలావుంటే.. గత ఏడాది వచ్చిన వరదలతో నష్టపోయిన రైతులకు రూ.6 వేల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నదాతలు ఆరోపిస్తుండడం కొసమెరుపు. ఏదేమైనా.. వర్షాలను కూడా రాజకీయంగా వాడుకున్న వైసీపీ నెత్తిన వరదలు పెద్ద బండనే పడేశాయని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా అతి చేయడం మంచిదికాదని, అప్పట్లో జగన్ అధికారంలోకి వచ్చాడు కాబట్టే రాష్ట్రంలో వర్షాలు కురిసి.. సుభిక్షంగా ఉన్న నేతలు.. ఇప్పుడు వచ్చిన వరదలకు కూడా జగనే కారణమని అంటే .. ఒప్పుకొంటారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట రామవరం లో వరద ఉధృతికి కుప్పకూలిన రెండంతస్తుల భవనం#jaggampeta #eastgodavari #andhrapradesh #floods #building #v6news pic.twitter.com/a7zqrXduQy
— V6 News (@V6News) October 14, 2020
దాదాపు 5 వేల ఓట్లున్న రెండు గ్రామాల ప్రధాన రహదారి పరిస్థితి @ysjagan. గారు..గ్రామం వాసాలతిప్ప,N రామేస్వరం ఉప్పలగుప్తం,అల్లవరం మండలలు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ pic.twitter.com/P7XqhNrwRh
— manohar.k (@manoharbabukarr) October 13, 2020
Nara Lokeshu@తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన నారా లోకేష్ పర్యటన...
— Rampuram Seena (@RampuramSeena) October 19, 2020
జగ్గంపేట,ప్రత్తిపాడు,పిఠాపురం,
అనపర్తి నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన
జగ్గంపేట నియోజకవర్గం రామవరం గ్రామంలో వరద ఉధృతి కి కుప్పకూలిన ఇళ్ళు,నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులు,గ్రామస్తులను పరామర్శించిన నారా pic.twitter.com/G5XlNmkfZL
పిఠాపురం మండలం. పి. దోంతమురు గ్రామంలో. సుద్దగడ్డ గండి పడడంతో నీట మునిగిన పొలం... ప్రతి చోటా ఇదే పరిస్థితి భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటలు రైతు కన్నీళ్లు కష్టాలు భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని @JanaSenaParty తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం. pic.twitter.com/AzFLIQD7Ar
— Bhema 🇮🇳 (@bhemamani) October 13, 2020
ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన వరదనీటిలో బిక్కుబిక్కుమంటున్న రైతులు, ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మంచినీరు, భోజనం కూడా అందించలేదా? పంటలు కోల్పోయి రైతులు విలపిస్తుంటే నష్టం లెక్కలను తక్కువగా చూపాలని ఆలోచన చేస్తారా? వరదనీటి నిర్వహణపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యంఉందా? @ysjagan pic.twitter.com/2A8YANCLjV
— Devineni Uma (@DevineniUma) October 18, 2020
భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. రైతులు తమకొచ్చిన కష్టాన్ని చెప్పుకుందామంటే ఇంతవరకు పాలకులెవరూ పలకరించిన పాపాన పోలేదు. ఇక పంట నష్టం అంచనాలు ఎప్పటికయ్యేను? ప్రభుత్వానికి సిఫారసు చేసేదెప్పుడు? పాలకులకు దయకలిగేది ఎప్పుడు? pic.twitter.com/z4ZxQnB2mi
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) October 20, 2020
లంక గ్రామ ప్రజలు వరదనీటితో ఇళ్ళు,పంటలు నీట మునిగి నానా యాతన పడుతుంటే ,వీరేంటీ మునిగిపోయిన పంట పొలాలను,ప్రాంతాన్ని పరిశీలించటానికి ఎండలో గొడుగు మోయటానికి వెనక మనుషులను పెట్టుకొని పెరాంటానికి వెళ్లినట్లు వెళ్తున్నారు🤦♀️🤦♀️🤦♀️🤦♀️ @VoiceOfAndhra_ pic.twitter.com/F5I4Cr7pgx
— Maha #SaveAmaravati#JusticeForAmaravathiFarmers (@Maha56440265) October 17, 2020