మోడీకి షాక్... 2024 వరకైనా ధర్నాకు రెడీ
జనవరి 19 న జరగాల్సిన పదవ రౌండ్ చర్చలకు ముందు రైతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు నిరసనలు ఆపేది లేదని, చివరకు 2024 ఎన్నికల వరకు కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
వ్యవసాయ బిల్లుల వియంలో కేంద్రం మరియు రైతులు తమ వాదనపై గట్టిగా ఉన్నారు. రైతుల స్పందనపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం స్పందించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వ్యవసాయ నాయకులను కొత్త వ్యవసాయ చట్టాలపై తమ "మొండి పట్టుదల వీడాలి" అంటూ సూచించారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా... ఇద్దరు ఎవరూ తగ్గకపోవడంతో వివాదం ముదురుతోంది. మోడీ ప్రతిష్ట మసకబారడానికి రైతుల ఉద్యమం కారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల, దేశాల రైతుల నుంచి కూడా రైతులకు మద్దతు లభిస్తోంది.
Solidarity with the #FarmersProtest from UK. pic.twitter.com/tm1afNLySQ
— Spartacus (@SDey83) January 13, 2021
మోడీని అయినా దించుతాం గాని వ్యవసాయ చట్టాలపై వెనక్కు తగ్గం అన్న కోణంలో రైతులు ముందుకు సాగుతున్నారు.