టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ చిత్రంతో పాటు ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్-కే’ చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇలా కొద్ది నెలలుగా 3 చిత్రాల షూటింగ్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ తాజాగా హాస్పిటల్ లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రభాస్ కు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే, బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ కాలికి గాయమైందని, ఆ తర్వాత ఆ గాయానికి యూరప్ లో సర్జరీ చేయించారని వార్తలు వచ్చాయి. కానీ, అదే గాయం కొద్ది రోజులు క్రితం ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడంతో 10 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఆ గాయం మళ్ళీ తిరగబెట్టడంతోనే ప్రభాస్ ఆసుపత్రికి వచ్చాడని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
అదీగాక, కొద్ది నెలలుగా ప్రభాస్ విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నారని, అందుకే ఆ గాయం ఎక్కువైందని అనుకుంటున్నారు. మరోవైపు, తన పెదనాన్న కృష్ణంరాజును చూసేందుకు ప్రభాస్ ఆసుపత్రికి వచ్చి ఉంటాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక, తనకు, తెలిసిన వారిని పరామర్శించేందుకే ప్రభాస్ ఆసుపత్రికి వచ్చి ఉంటాడని ఇంకొందరు అంటున్నారు. అయతే, అసలు ప్రభాస్ ఆసుపత్రికి ఎందుకు వచ్చాడు అన్న విషయం పై క్లారిటీ లేదు. మరి, ఈ విషయంపై ప్రభాస్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ కంగారుకు చెక్ పెడితే బాగుంటుంది.